ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ మధ్య చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది.. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ మధ్యే జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత ఇక కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయనేది మరింత స్పష్టం అయ్యింది.. వైఎస్ జగన్ అధికాంరలోకి వచ్చాక తొలి కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత.. ఐదేళ్లు పదవులు ఉండబోవని.. మధ్యలోనే మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పారు.. అయితే, ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది.. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.. ఏప్రిల్ 11వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Fire Accident: బోయిగూడ అగ్నిప్రమాదం.. వెలుగులోకి కీలక విషయాలు..!
ఇప్పుడు కేబినెట్ విస్తరణలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది.. మంత్రి పదవుల నుంచి తొలగించినా.. వారిని పూర్తిగా పక్కనబెట్టినట్టు కాదని.. పార్టీ వ్యవహారాల్లో వారు కీలకంగా పనిచేస్తారని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే కాదు.. మొత్తంగా మూడేళ్ల గడువుకు ముందే కొత్త మంత్రులు కొలువదీరబోతున్నారు.. మూడేళ్ల తర్వాత మార్పులు చేయాలనుకున్నా ముహూర్త బలం కోసం ఏప్రిల్‌లోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు.. ఎవరు పదవులు ఉంటాయి..? మరెవరికి ఊడిపోతాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.. కేబినెట్‌లో ఉన్నవారిలో ఒక టెన్షన్ అయితే.. ఇక, కేబినెట్ పదవులు ఆశిస్తున్నవారిలోనూ ఈసారైనా పదవి దక్కుతుందా? లేదా? అనే టెన్షన్ నెలకొంది. మరి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికంగా మారింది.