తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు తమిళిసై సౌందరరాజన్ దంపతులు.. నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోనే బస చేసిన తెలంగాణ గవర్నర్.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన తమిళిసై.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలో.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు… ప్రజలందరూ […]
సంక్రాంతి సంబరాల్లో అనేక పోటీలు నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు, ఎడ్ల పందాలులు చాలా ఫేమస్.. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఇవి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువని చెబుతారు.. అయితే, ఈ సారి కోడి పందేలు, ఎడ్ల పందాలకు భిన్నంగా.. పందుల పోటీలు నిర్వహించారు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ […]
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.. ఆ దేశ దేశీయ వాణిజ్యం క్షీణించిపోయింది.. మరోవైపు.. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు కూడా దొరక్కపోవడంతో పాక్ ఖాజానా ఖాళీ అయ్యింది.. దీంతో.. దిద్దుబాటు చర్యలకు దిగిన పాక్.. కొత్త జాతీయ భద్రతా పాలసీని తీసుకొచ్చింది.. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వంటి సంస్థలను రుణాల కోసం ఆశ్రయించిన ఆ దేశం.. సరైన స్పందనలేదని ఆరోపిస్తోంది.. దీంతో.. కొన్ని వర్గాలుగా కాదు.. ఓ జాతిగా మనందరం అభివృద్ధి సాధించడానికి జాతీయ భద్రతా […]
మేషం : ఈ రోజు ఈ రాశివారి వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడుతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారికి బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. సొంతంగా గాని, భాగస్వామ్యంగాగాని మీరు ఆశించిన విధంగా రాణించలేరు. బంధువులతో సంబంధాలు […]
డ్రాగన్ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె… సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో […]
ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో టెస్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. ప్రపంచంలోనే పేరుమోసిన సంస్థ టెస్లా.. అధునాతన టెక్నాలజీతో వాహనాలను ప్రవేశపెడుతూ.. ఎప్పటికప్పుడూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. టెస్లా కార్లు భారత్‌కు ఎప్పుడొస్తాయి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్నా.. తాజాగా.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించడంతో.. మరోసారి ఈ వ్యవహారం చర్చగా మారింది.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక అంశాలపై స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. వెంటనే ఈ అంశంపై […]
సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవిని […]
టాలీవుడ్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో ఘనంగా జరుపుకుంటున్నారు.. నిన్న భోగి వేడుకల్లో సందడి చేసిన బాలయ్య.. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.. ఇక, బాలయ్య గుర్పంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది.. గుర్రంపై బాలయ్య కూర్చొని ఉండగా.. ఆ గుర్రంతో డ్యాన్స్ వేయించారు.. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తుండగా.. […]