దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ).. నందమూరి బాలకృష్ణ లవ్‌లో పడిపోయారు.. అదేంటి? బాలయ్యతో ఆర్జీవీ లవ్ ఏంటి? అనుకుంటున్నారేమో… ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షోతో ప్రేమలో మునిగితేలుతున్నారు ఆర్జీవీ.. టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.. మోహన్‌బాబు ఫ్యామిలీ, దర్శక ధీరుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, అల్లు అర్జున్, రవితేజ, రానా, నాని, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి.. ఇలా చాలా మందిని తన […]
తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారినపడ్డారు.. మరోవైపు.. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ఇలా చాలా మందికి కోవిడ్ సోకింది.. తాజాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో… మంత్రులు, ఇతర నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జిల్లాలో పంట నష్టంపై తాజాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు […]
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి… ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది.. జిల్లాలో నిన్న ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. అందులో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు బోధనేతర సిబ్బందికి కోవిడ్ సోకింది.. ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్లో ఇద్దరికి చొప్పున కరోనా వచ్చింది.. ఒంగోలు కేంద్రీయ […]
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న సమయంలో.. పలు రకాల రీసెర్చ్‌లు కోవిడ్ తీవ్రతను అంచనా వేస్తూ.. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. దేశంలో క్రమంగా కోవిడ్ మీటర్ మరోసారి పైకి పరుగులు పెడుతోన్న సమయంలో.. ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎబ్బీఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ వ్యాప్తి మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని అంచనా వేసింది ఎస్బీఐ రీసెర్చ్.. ఇప్పటికే […]
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. అయితే, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. Read Also: ఇక వన్డే సమరం.. సిరీస్‌పై […]
సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న కసితో ఉంది. వన్డే జట్టు కెప్టెన్‌గా పగ్గాలందుకున్న కేఎల్ రాహుల్.. ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్ని రాహులే స్వయంగా ప్రకటించాడు. వన్డేల్లో ఎప్పుడూ 4 లేదా ఐదో స్థానంలో బరిలోకి దిగే రాహుల్… గాయం కారణంగా రోహిత్ శర్మ సిరీస్‌కు దూరం కావడంతో… […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. లిటిగేషన్ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు దూకుడు తగదు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభించదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశివారి ఇంటికి బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలులో చికాకులు తప్పవు. గృహోపకరణాలు […]
చింతామణి నాటకంపై నిషేధం విధించింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం… చింతామణి నాటకం ఆర్యవైశ్యులను కించపరిచే విధంగా ఉందంటూ.. నాటక ప్రదర్శనను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్యులు.. దీంతో.. చింతామణి నాటకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో ఎక్కడా చింతామని నాటకాన్ని నిర్వహించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. ఇక, చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హర్షంవ్యక్తం చేశారు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది.. ఈ మేరకు రేపు (మంగళవారం) కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొననున్నారు. వర్షా కాలం ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగింది. ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందని కేబినెట్‌కు వివరించారు అధికారులు.. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా సాగింది.. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మొదట చర్చ సాగింది.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 […]