Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!
- కాటన్ బడ్స్‌ను చెవి లోపలికి పెట్టకండి
- వైద్యుల సలహా లేకుండా చెవిలో నూనె వేయొద్దు
- బిగ్గర శబ్దంతో సంగీతం వినడం ప్రమాదం
- చెవి నొప్పికి సొంతంగా మందులు వాడకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ear Care Tips in Telugu: మనం రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మన వినికిడి శక్తిని దెబ్బతీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే చెవుల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చాలా మంది చెవులలో వచ్చే చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఈ అలవాట్లు భవిష్యత్తులో శాశ్వత వినికిడి లోపానికి (Hearing Loss) దారితీయవచ్చు. ఆ అలవాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాటన్ బడ్స్‌ను లోపలికి పెట్టకండి
చెవిలో దురదగా అనిపించినప్పుడు చాలా మంది కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తారు. అయితే, వీటిని చెవి లోపలికి పెట్టడం వల్ల చెవిలోని వ్యాక్స్ (Ear wax) బయటకు వచ్చే బదులు మరింత లోపలికి నెట్టబడుతుంది. దీనివల్ల చెవిలో అడ్డంకులు (Blockage) ఏర్పడటమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ల ప్రకారం, కాటన్ బడ్స్‌ను కేవలం చెవి వెలుపలి భాగాన్ని శుభ్రం చేయడానికి మాత్రమే వాడాలి.
Also Read
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
వైద్యుల సలహా లేకుండా నూనె వేయకండి
చెవిలో నూనె వేయడం మంచిదని కొందరు నమ్ముతారు. కానీ ఇది తప్పు. చెవిలో నూనె వేయడం వల్ల బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా నేరుగా ఇఎన్‌టి (ENT) నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
అధిక శబ్దంతో సంగీతం
హెడ్‌ఫోన్‌లు లేదా ఇయర్‌ఫోన్‌ల ద్వారా గంటల తరబడి బిగ్గరగా సంగీతం వినడం వినికిడి శక్తిని తగ్గిస్తుంది. ముఖ్యంగా ’60/60′ రూల్‌ను పాటించాలి. అంటే, వాల్యూమ్‌ను 60 శాతం కంటే తక్కువగా ఉంచాలి , ప్రతి 60 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవాలి. డీజేలు, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే ప్రదేశాల్లో చెవులకు రక్షణగా ఇయర్ ప్లగ్స్ వాడటం మంచిది.
సొంత మందులు వాడటం
చెవిలో నొప్పి లేదా ఏదైనా ద్రవం కారుతుంటే మెడికల్ షాపుల్లో దొరికే ఇయర్ డ్రాప్స్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడకండి. అలాగే కడ్డీలు, హెయిర్ పిన్స్ వంటి పదునైన వస్తువులతో చెవిని గీకడం వల్ల కర్ణభేరి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు అకస్మాత్తుగా వినికిడి తగ్గడం లేదా తల తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!