దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం తనకంటూ ఓ స్థానం సంపాదించారు. అంతర్జాతీయ వేదికలపై సైతం మణిరత్నం హవా విశేషంగా వీచింది. ఇంతకూ మణిరత్నంలో అంత గొప్పతనం ఏముందబ్బా? అంటూ ఎకసెక్కేలు చేసేవారు ఉన్నారు. ఎందుకంటే చాలా రోజులుగా మణిరత్నం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటలేకపోతున్నాయి. పైగా ఆయన నుండి వస్తున్న చిత్రాలలోనూ పాతకథలే కనిపించాయి. దాంతో ఈ తరం జనం మణి సినిమాలను అంతగా పట్టించుకోవడం లేదు. అందువల్ల నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని […]
ఏడు వేలకు పైగా పాటలు… 1400 పై చిలుకు సినిమాలు… ఇరవై వేలకు పైగా కాన్సర్ట్స్… ఒకే సంగీత దర్శకుడు సుసాధ్యం చేశారంటే నమ్మశక్యమా!? అవును, నమ్మితీరాలి… ఎందుకంటే ఆ ఫీట్ సాధించిన వారు ఇళయరాజా! కాబట్టి సాధ్యమే అని నమ్మవచ్చు. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి […]
నటశేఖర కృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ తెరకెక్కించిన అనేక చిత్రాలు మాస్ ను విశేషంగా అలరించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘హంతకులు – దేవాంతకులు’. ఎస్.ఆర్.కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 1972 జూన్ 2న విడుదలై జనాన్ని ఆకట్టుకుంది. ‘హంతకులు – దేవాంతకులు’ కథ ఏమిటంటే – రాజేశ్ సి.ఐ.డి. – అచ్చు అతనిలాగే ఉండే అతని అన్నను, అతని తల్లిని బలరామ్, లైలా, ప్రేమ్ అనే దుండగులు చంపేసి, డబ్బు దోచుకుంటారు. […]
ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని […]
‘ప్రతి రోజు పండగే’ లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. జులై […]
ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అతి తక్కువ మొత్తానికి వినోదాన్ని అందిస్తున్న సంస్థ ఆహా! కేవలం 299 రూపాయలతో యేడాది పాటు కంటెంట్ ను చూసే సౌకర్యం ఉంది. అయితే వ్యూవర్స్ ను మరింతగా పెంచుకునేందుకు తాజాగా ఆహా ఓ కొత్త ఆకర్షణీయమైన ప్లాన్ తో వచ్చింది. మూడు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలతో పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మొత్తంతో […]
మూడు దశాబ్దాల క్రితం రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ‘రెక్కీ’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, తదనంతర పరిణామాలతో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను పోలూరి కృష్ణ తీశారు. ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ‘రెక్కీ’ని జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ లెనిన్ గా శ్రీరామ్ నటించగా, శివ బాలాజీ, ధన్యా […]
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్ […]
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇప్పుడు డిజిటల్ మీడియాలోకీ అడుగుపెట్టాడు. అతను నటిస్తున్న ‘ది బాయ్స్’ వెబ్ సీరిస్ సీజన్ 3 జూన్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రచారానికి శ్రీకారం చుట్టిన షాహిద్ కపూర్ ఈ వెబ్ సీరిస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. ”సహజంగా సూపర్ హీరోస్ అంటే సమాజానికి, తమ చుట్టు ఉన్న ప్రజలకు మేలు చేస్తారు. కానీ నేను నటించిన […]
కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథి. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ ‘నా సినీ ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరివాడిని కాదు. నా బిగ్గెస్ట్ హిట్ తెలుగులోనే వచ్చింది. ఇక్కడ నాకు వరుస విజయాలు లభించాయి. నిజానికి నేను, వెంకటేశ్ కలసి ‘మర్మయోగి’ చేయవలసి ఉంది. మిస్ అయింది. వెంకీ కాస్ట్యూమ్ […]