సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ […]
దగ్గుబాటి రానా అభిమానులకు రెండు శుభవార్తలను అతని నిర్మాతలు మే 30న కలిగించారు. అందులో మొదటిది వెంకటేశ్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సీరిస్ ‘రానా నాయుడు’ షూటింగ్ పూర్తయిపోయిందనే వార్త. అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సీరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ అయ్యేది తెలియచేస్తామని మేకర్స్ తెలిపారు. ఇక రెండోది ఎప్పటి నుండో ఇదిగో అదిగో అంటూ వస్తున్న ‘విరాట పర్వం’ విడుదల తేదీని ప్రీపోన్ చేయడం. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే […]
తెలుగు చిత్రసీమలో మాస్ హీరోగా తనదైన బాణీ పలికించిన కృష్ణ ‘హీరో’ కృష్ణగా, నటశేఖర కృష్ణగా, ఆ పై సూపర్ స్టార్ కృష్ణగా సాగారు. తెలుగునాట 325 పై చిలుకు చిత్రాల్లో నటించిన నటునిగా ఓ రికార్డ్ సాధించారు. తెలుగు సినిమా రంగానికి సాంకేతికంగా సినిమాస్కోప్, టెక్నికలర్ వంటి అంశాలను అందించిన ఘనత కూడా కృష్ణ సొంతం. నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా, ఎడిటర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు కృష్ణ. ఆయన నటవారసునిగా మహేశ్ బాబు […]
రాక్ స్టార్ యష్ నటించిన ఓ కన్నడ సినిమాను ‘రారాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ‘కెజిఎఫ్’ కంటే ముందు కన్నడలో ‘సంతు స్ట్రైట్ ఫార్వర్డ్’ పేరుతో విడులైన ఈ సినిమాకు మహేశ్ రావు దర్శకుడు. ఇందులో యశ్ భార్య రాధికా పండిట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమాను పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు […]
అమెరికన్ క్రైమ్ డ్రామా సీరిస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకుంటోంది ‘రానా నాయుడు’. నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మితమౌతున్న ఈ వెబ్ సీరిస్ లో మొట్టమొదటి సారి వెంకటేశ్ నటిస్తుండటం విశేషం. అలానే మొదటిసారి బాబాయ్ వెంకటేశ్ తో కలిసి ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ను ఇందులో చేస్తున్నాడు రానా. ఇల్లీగల్ వ్యవహారాలు చేసే వ్యక్తిగా రానా నటిస్తుండగా, అతని తండ్రిగా, జైలు నుండే అన్ని కార్యక్రమాలను సెట్ చేసే గ్యాంగ్ స్టర్ గా వెంకటేశ్ […]
ఈ రోజుల్లో ఆ యా సినిమాల్లో నటించిన హీరోయిన్లు తమ సినిమా ఆడియో వేడుకలో పాల్గొనటానికి అదనంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది ఓ తమిళ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ లో 10 మంది హీరోయిన్లు సందడి చేయట విశేషంగా మారింది. ఆ హీరో ఎవరో కాదు శరవణ. లెజెండ్ శరవణన్ అనే ఇతగాడు తమిళనాడులో బడ్డింగ్ హీరో. అయితే ఇతగాడు పెద్ద బిజినెస్ మేన్. శరవణ స్టోర్స్ అధినేత అయిన ఇతగాడికి నటన అంటే […]
గడిచిన నాలుగు నెలలతో పోల్చితే మే లో తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. స్ట్రయిట్, డబ్బింగ్, ఓటీటీ సినిమాలతో కలిపి కేవలం 17 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే పలు చిన్న సినిమాల నడుమ ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3′ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వీక్ వైజ్ గా చూసుకుంటే మే 6వ తేదీ ఏకంగా ఏడు సినిమాలు ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సందడి చేశాయి. చాలా […]
ఈ రోజు ఇండియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రసీమ టాలీవుడ్. అయితే అందుకు అనుగుణంగా మన హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఒకప్పుడు చిత్రసీమలో కమిట్ మెంట్ కి ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడది కాగడా పెట్టి వెతికినా కానరాదు. ఎవరికి వారు సక్సెస్ వెంట పరుగులు పెడుతూ అది ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారు. సక్సెస్ లో ఉన్న వారిని కలుపుతూ క్రేజీ కాంబినేషన్ లు సెట్ చేసుకుని లాభ […]
తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించిన సింగీతం శ్రీనివాసరావుకు సతి వియోగం కలిగింది. ఆయన భార్య లక్ష్మీ కళ్యాణీ చెన్నయ్ లో శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 62 సంవత్సరాల తమ దాంపత్య జీవితానికి తెరపడిందని ఆయన అన్నారు. యుక్త వయసులోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన సింగీతం శ్రీనివాసరావుకు అరవైయేళ్ళకు పైగా ఆమె చేదోడు వాదోడుగా ఉన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ […]
పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యంగ్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. ఇది తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్ చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. శనివారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా […]