ప్రముఖ గాయకుడు కెకె హఠాన్మరణంతో తన గుండె బద్దలయిందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమలో ‘దాయి దాయి దామ్మా’, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చైల చైల, ‘జై చిరంజీవ’లో ‘హే జానా’ పాటలను అలపించారు కెకె. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు చిరంజీవి. Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and […]
‘అఖండ’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన బోయపాటి రామ్ హీరోగా కొత్త సినిమాను ఆరంభించారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. బుధవారం ఉదయం పూజతో ఆరంభమైన ఈ సినిమా దర్శకుడిగా బోయపాటికి 10వ సినిమా. హీరో రామ్ కు 20వ సినిమా. ‘ది వారియర్’ తర్వాత రామ్ నటిస్తున్న చిత్రమిది. రామ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ […]
చూడగానే మనకు బాగా పరిచయం ఉన్న అబ్బాయిలా కనిపిస్తాడు. మన పక్కింటి కుర్రాడే అనిపిస్తాడు నిఖిల్ సిద్ధార్థ్! తనదైన చలాకీ అభినయంతో సాగుతున్న నిఖిల్ నవతరం ప్రతినిధిగా కనిపించే పాత్రల్లో సాగుతున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. తరువాత ‘ముఫ్పఖమ్ ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’లో బి.టెక్, చదివాడు. అతని మనసు చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపైనే లగ్నమయింది. ఇంట్లో వాళ్ళు […]
ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడే, అంతకు మించిన సంగీత దర్శకుడు! ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో ఈ తరం వారికి పలు లోటుపాట్లు కనిపించవచ్చు. కానీ, కృష్ణారెడ్డి స్వరకల్పన మాత్రం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో వినోదంతో పాటు సంగీతమూ ఆనందం పంచేది. ఎస్వీ జైత్రయాత్ర సాగుతున్న రోజుల్లో పాటలపందిళ్ళు కూడా వేస్తూ సాగారు. ప్రతీచోట జేజేలు అందుకున్నారు. అందుకే కొందరికి ఆయన ‘ఎస్.వి.’ అంటే ‘స్వరాల వరాల కృష్ణారెడ్డి’ అనిపించారు. మరికొందరికి స్వర […]
మే 31 వైజాగ్ లో జరిగిన ‘బ్రహ్మాస్త్రం’ ప్రెస్ మీట్ సూపర్ హిట్ అయ్యింది. సాగరతీర వాసులు ‘బ్రహ్మస్త్రం’ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, దర్శక ధీరుడు రాజమౌళికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పబ్లిక్ ఇంటరాక్షన్ లో రణబీర్ కు సంబంధించిన ఓ విశేషాన్ని అక్కడి జనాలకు తెలియచేశాడు రాజమౌళి. హీరో రణబీర్ కపూర్ కథను అడగకుండా తన దగ్గరకు వచ్చే మనిషి ముఖం చూసి, ప్రాజెక్ట్ ను ఓకే […]
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. తన సినిమాల కథల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే సుధీర్ ఈ తాజా సినిమా విషయంలో కూడా టైటిల్ తోనే ఆశ్చర్యపరిచాడు. జయాపజయాలక అతీతంగా ముందుకు సాగుతున్న సుధీర్ బాబు తాజా సినిమా ‘మామ మశ్చింద్రా’. రచయిత, దర్శకుడు హర్షవర్ధన్ తో ఈ సినిమా చేస్తున్నాడు సుధీర్. మామ, సూపర్ స్టార్ కృష్ణ గారి […]
సూపర్ కృష్ణ 80వ పుట్టినరోజు నేడు. గతంలో ఆయన పుట్టినరోజు అంటే అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. సహజంగా వేసవి కాలంలో కృష్ణ ఊటీలో ఉండేవారు. తన సినిమాల షూటింగ్స్ ను అక్కడే ప్లాన్ చేసుకునేవారు. దాంతో రాష్ట్రం నలుమూలల ఉండే అభిమానులంతా మే 31వ తేదీకి ఊటికి చేరుకుని కృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని వచ్చేవారు. ఇక కెరీర్ కు ఆయన ఫుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ లోని నానక్ […]
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సాహితీ పురస్కారం 2022 సంవత్సరానికి ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి ఇవ్వాలని పురస్కార కమిటీ నిర్ణయించింది. ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ కమిటీలో సభ్యులు. త్వరలో పురస్కార ప్రదాన కార్యక్రమ వివరాలు తెలియజేయనున్నారు. ‘శ్రీ శ్రీనివాసాచార్య కవిత్వానికీ, అందులోని గాఢమైన, హృద్యమైన పద వైచిత్రికీ, ఆలోచనకి, కావ్యానురక్తికి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న కవులు. ఆ ఆనందాన్ని ఆస్వాదించే క్రమంలో ఈ పురస్కారం ఒక చిన్న బహుమానం […]
హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీ రాబోతోంది ‘బ్రహ్మస్త్ర: శివ’ చిత్రం. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ వైజాగ్ లో మంగళవారం గ్రాండ్ వేలో జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే విడుదలైన టీజర్ ను, ఇందులోని కొన్ని పాత్రలకు సంబంధించిన లిటిల్ బిట్స్ ను ఆడియెన్స్ కోసం ప్రదర్శించారు. ఇదే ఫంక్షన్ లో ‘బ్రహ్మాస్త’కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ డేట్ ను తెలియచేసే టీజర్ ను ప్లే చేశారు. సినిమా […]
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అయాన్ తొలి చిత్రం ‘వేకప్ సిద్’ 2009లో వచ్చింది. అందులో హీరో రణబీర్ కపూర్. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే 2013లో అయాన్ రెండో సినిమా ‘యే జవానీ హై దివానీ’ వచ్చింది. అందులోనూ రణబీరే హీరో. ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ళ తర్వాత అయాన్ ముఖర్జీ మూడో సినిమా ‘బ్రహ్మస్త’ రాబోతోంది. ఇందులోనూ రణబీర్ కపూరే హీరో. […]