Natti Karuna: ఐకానిక్ ఇండియా అందాల పోటీ విజేతగా తెలుగు నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ విజేతగా నట్టి కరుణ నిలిచారు. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ స్థాయిలో జరిగిన ఈ అందాల పోటీలో వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు అందాల భామలు పాల్గొన్నారు. ఈ పోటీలో ఈ ఏడాది విన్నర్ గా నట్టి కరుణ పోటీపడి, విజయం సాధించారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కుమార్తె అయిన నట్టి కరుణ తమ సొంత బ్యానర్ లో నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అలానే ఇటీవల తొలి ప్రయత్నంగా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించిన ‘డి ఎస్ జె’ (దయ్యంతో సహజీవనం) చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ఈ నేపథ్యంలో నటిగా మరింత పేరుతెచ్చుకోవాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కరుణ ఐకానిక్ ఇండియా అందాల పోటీ 2022 టైటిల్ గెలుచుకోవడంతో ఆమెకు మరింత క్రేజ్ లభిస్తోంది.
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
![]()
బుధవారం నట్టి కరుణ మీడియాతో ముచ్చటిస్తూ, ”వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతో పోటీపడి, ఈ టైటిల్ ను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా, థ్రిల్లింగ్ గా ఉంది. త్వరలో గోవాలో, కేరళలో జరగబోయే అందాల పోటీలలో కూడా పాల్గొనబోతున్నాను. సినిమాల విషయానికి వస్తే, ఓ రీమేక్ చిత్రంలో నటించబోతున్నాను. ఇందులో హీరోయిన్ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో పాటు నటించడానికి అవకాశం చక్కటి పాత్ర లభించింది. అలానే తమిళంలో ఓ చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చింది, అయితే ఆ సినిమాకు సంబందించిన చర్చలు జరుగుతున్నాయి” అని అన్నారు.
![]()
ఓపక్క కరుణ తండ్రి నట్టి కుమార్ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ తో న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరుణ, ఆమె సోదరుడు క్రాంతి తన సంతకాలను ఫోర్జరీ చేశారంటూ వర్మ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇచ్చారు. ఇది ఇలా సాగుతుండగానే కరుణ్ అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం విశేషం.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!