OnePlus 15R: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ఫోన్ OnePlus 15Rను డిసెంబర్ 17న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన Ace 6Tకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఇది రానున్నప్పటికీ.. భారత వెర్షన్‌లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు సమాచారం. ఈ లాంచ్ ఈవెంట్‌లో OnePlus Pad Go 2 కూడా పరిచయం కానుంది. OnePlus 15R స్పెసిఫికేషన్లపై ఇప్పటికే స్పష్టత ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ధరలపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా ధరలకు సంబంధించిన సమాచారం లీక్ అయ్యింది. లీకైన సమాచారం ప్రకారం.. భారతదేశంలో OnePlus 15R ప్రారంభ ధర రూ. 45,999 లేదా రూ. 46,999గా ఉండే అవకాశం ఉంది. ఈ ధర 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌కు వర్తిస్తుంది. ఇక 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.51,999గా ఉండొచ్చు. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు ఉండకపోవచ్చు. అయితే ఆ లాంచ్ సమయంలో రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు అదనపు డిస్కౌంట్ లభించే అవకాశముంది.
కొత్త ఏడాదిలో వినియోగదారులకు Mercedes-Benz షాకింగ్ న్యూస్.. మరింత పెరగనున్న కార్ల ధరలు
OnePlus 15R చార్ కోల్ బ్లాక్, మింటి గ్రీన్, ఎలక్ట్రిక్ వైలెట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. OnePlus అధికారికంగా వెల్లడించిన ప్రకారం.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో వచ్చే ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌గా OnePlus 15R నిలవనుంది. ఈ చిప్‌సెట్ పనితీరు, పవర్ ఎఫిషియెన్సీని మెరుగుపరచడానికి వన్‌ప్లస్, క్వాల్కమ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు కలిసి పని చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇక ఇందులో డిస్‌ప్లే విషయానికి వస్తే.. 6.83 ఇంచుల AMOLED డిస్‌ప్లే ఉండనుంది. ఇది Full HD+ రిజల్యూషన్ తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా మొబైల్ గేమింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు స్మూత్ స్క్రోలింగ్, మెరుగైన గేమ్‌ప్లే అనుభూతిని అందించనుంది.
Sarfaraz Khan: 18 బంతుల్లో హాఫ్ సెంచరీ.. ఐపీఎల్ 2026 వేలానికి ఇది సరిపోతుందా…?
OnePlus 15Rలో మరో ప్రధాన ఆకర్షణగా 7,400mAh భారీ బ్యాటరీను అందించనున్నారు. ఇది గత ఏడాది వచ్చిన OnePlus 14Rతో పాటు ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ OnePlus 15 కంటే కూడా పెద్ద బ్యాటరీగా కంపెనీ ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 80W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే చార్జింగ్ వేగానికి సంబంధించిన పూర్తి వివరాలను వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మొత్తంగా అత్యాధునిక ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో OnePlus 15R ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. లాంచ్ అనంతరం అసలైన ధరలు, ఆఫర్లు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.