Bapatla Crime: అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని, ఏడు అడుగులు కలిసి నడిచిన సహధర్మచారిణి కడతేర్చాడు ఒక భర్త. బంగారం ఆశ చూపి భార్యను ఊరవతలకి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు ఆ భర్త. ఈ ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరులో వెలుగుచూసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన మహాలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
READ ALSO: Nitin Nabin: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్.. ఎవరు ఈయన..
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం మాచవరం వెళ్లిన వెంకటేశ్వర్లు బంగారం ఆశ చూపి భార్యను నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అధికారుల ముందు లొంగిపోయాడు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే మహాలక్ష్మిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
READ ALSO: India vs Pakistan U19: మరోసారి నో షేక్‌హ్యాండ్స్.. చర్చనీయాంశమైన ఇండియా–పాక్ మ్యాచ్