ఈ శుక్రవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు పోటీపడ్డాయి. అవే కమన్ నటించిన ‘విక్రమ్’, అక్షయ్ కుమార్ నటించిన ‘పృధ్వీరాజ్’, అడవిశేష్ నటించిన ‘మేజర్’. ‘విక్రమ్’ లో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, పహాద్ ఫాజిల్, అతిథి పాత్రలో సూర్య మెరిశారు. ‘ఖైదీ’తో ఊపుమీదున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. దీంతో దీనిపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు పాజిటీవ్ టాక్ రావటంతో తమిళనాట మంచి హిట్ […]
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన’అంటే సుందరానికి’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ నెల 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్ పాజిటివ్ బజ్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందనే అభిప్రాయాన్ని కలగచేశాయి. సెన్సార్ లో క్లీన్ యు కొట్టేశాడు సుందరం. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 56 నిమిషాలు. ‘ఆర్ఆర్ఆర్, విక్రమ్’ చిత్రాల కోవలో దాదాపు […]
చూడగానే బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా కనిపించే ప్రియమణి అభినయంతో పాటు అందాల ఆరబోతతోనూ అలరించింది. అందువల్లే ప్రియమణి అభిమానగణాలకూ కొదువలేదు. టాలీవుడ్ టాప్ స్టార్స్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ ప్రియమణి నర్తించిన తీరు ప్రేక్షకులకు పరమానందం పంచింది. తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన ఈ కన్నడ కస్తూరి తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, […]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నోట ఏ మాట పలికినా, అది మధురామృతంగా మారిపోతుందని అందరికీ తెలుసు. సందర్భానుసారంగా తన స్వరాన్ని సవరించుకొనే బాలు నటుల విలక్షణమైన వేషధారణలోనూ అందుకు తగ్గట్టుగా గానం చేసి మురిపించారు. ఇక ఆయనతో పాటు ఇలాంటి పాటల్లో గళం విప్పడానికి సాటి గాయకులు సైతం ఉత్సాహంతో ఉరకలేసి మరీ పాడారు. తెలుగు చిత్రసీమలోని టాప్ స్టార్స్ అందరికీ ఒకప్పుడు ఎస్పీ బాలు గాత్రం తప్ప మరో ఆధారం లేదు. ఇక టాప్ హీరోస్ వరైటీ […]
అడవిశేష్ ‘మేజర్’ సినిమా చూసిన వారికి అందులో శేష్ తో పాటు అందరికీ బాగా గుర్తుండిపోయే పాత్ర సాయిమంజ్రేకర్ పోషించిన ఇషా పాత్ర. శేష్ క్లాస్ మేట్ గా, లవర్ గా, వైఫ్ గా అన్ని షేడ్స్ లో సాయీ మంజ్రేకర్ ఆడియన్స్ మది దోచిందనే చెప్పాలి. నిజానికి సాయి నటించిన తొలి తెలుగు సినిమా ‘గని’ ఏమాత్రం ఆటక్టుకోలేక పోయింది. అది దర్శకుడి వైఫల్యం కావచ్చు. పాత్రలో సరైన గ్రిప్ లేకపోయి ఉండవచ్చు. కానీ ‘మేజర్’ […]
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కొత్త సినిమా శుక్రవారం బెంగళూరులోని గవిపుర గుట్టహళ్లిలోని శ్రీ భాండేమహాకాళి ఆలయంలో ప్రారంభమైంది. ‘యు.ఐ’ (UI) పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకి ఉపేంద్ర దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈ ప్రారంభోత్సవానికి కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్, సలగ విజయ్ తదితరులు హాజరయ్యారు. పూజ తర్వాత సుదీప్ తొలి క్లాప్ తో సినిమా ఆరంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ […]
ప్రముఖ రాజకీయ జంట కొండా మురళి, సురేఖ జీవిత కథ ఆధారంగా రూపొందిన సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దీనికి దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. కొండా సుస్మితా పటేల్ ఈ చిత్ర నిర్మాత. జూన్ 23న సినిమా విడుదల కానుంది. శుక్రవారం రెండో థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ”ట్రైలర్ నుంచి బేసిక్ పాయింట్ అర్థం అయ్యి […]
తమిళ యువ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే! దాని పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దీనికి ‘జవాన్’ అనే పేరు ఖరారు చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ఎస్.ఆర్.కె. ప్రెజంటర్ గా ఉన్నారు. ఈ మూవీ టైటిల్ కు ను ప్రకటిస్తూ ఓ టీజర్ ను విడుదల […]
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.ఎఫ్‌డిసితో ఒప్పందం చేసుకోవాలని, ప్రొవైడర్ గేట్‌వే ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోర్టల్ సినిమా విడుదలకు ముందే బుకింగ్ స్లాట్‌లను నిర్వహించనుంది. రిలీజ్ కి ఒక వారం ముందు థియేటర్లు […]
అందరిలో ఆసక్తి కలిగించే విషయాలు నాలుగు ప్రధానాంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలని క్రీస్తు పూర్వం నుంచీ ఎందరో తాత్వికులు ప్రతిపాదించారు. నవీనయుగం ఆ నాలుగు అంశాలనూ “Political, Economical, Social and Technological” అంటూ పేర్చి, ముద్దుగా ‘PEST’ అని పెట్టుకుంది. ఈ నాలుగు అంశాల నుంచి తప్పించుకొనే ప్రధాన అంశాలేవీ ఉండవు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ‘డ్రగ్స్’ కేసు నుండి ‘క్లీన్ చిట్’తో […]