Mercedes-Benz: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) 2 శాతం వరకు ధరల పెంపును ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. లగ్జరీ ఆటోమొబైల్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్ అస్థిరత, ముడిసరుకు ధరల పెరుగుదల, లాజిస్టిక్స్ సమస్యలు కారణంగా ఆపరేషనల్ ఖర్చులు భారీగా పెరిగినట్లు మెర్సిడెస్-బెంజ్ సంస్థ స్పష్టం చేసింది. వీటన్నింటి ప్రభావంతో ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని తెలిపింది.
ఇక మెర్సిడెస్-బెంజ్ ఇండియా ప్రకారం.. 2025 మొత్తంలో యూరో, రూపాయి మారకం విలువ రూ. 100కు పైగానే కొనసాగింది. ఇది గత సగటు స్థాయిలతో పోలిస్తే ఎక్కువ. దీని వల్ల లోకల్ అస్సెంబెలింగ్ కోసం దిగుమతి చేసే భాగాలు, అలాగే పూర్తిగా దిగుమతి చేసుకునే కార్లు (CBUs) ఖర్చులు పెరిగాయి. ఫలితంగా కంపెనీ మొత్తం కార్యకలాప వ్యయం ఎక్కువైంది. లోకలైజేషన్ వ్యూహం ద్వారా ఈ ఖర్చులలో చాలా భాగాన్ని సంస్థ భరించినప్పటికీ, వ్యాపార స్థిరత్వం కోసం పరిమిత స్థాయిలో ధరల సవరణ అవసరమైందని కంపెనీ పేర్కొంది.
John Cena: రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఓడిపోయిన జాన్‌సీనా.. ఓడించింది ఇతనే!
ఈ విషయంపై మెర్సిడెస్-బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో మాట్లాడుతూ.. ఈ ఏడాది మేము ఊహించిన దానికంటే ఎక్కువ కాలం కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగాయి. యూరో విలువ నిరంతరం 100కు పైగా ఉండటం వల్ల దిగుమతి భాగాలు, పూర్తిగా దిగుమతి కార్లు సహా మా కార్యకలాపాలన్నింటిపై ప్రభావం పడింది. అంతేకాదు ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, ద్రవ్యోల్బణం కారణంగా మొత్తం ఆపరేషనల్ ఖర్చులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. అదే సమయంలో ఆర్బీఐ రెపో రేటు తగ్గింపులు మెర్సిడెస్-బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా కస్టమర్లకు ప్రయోజనంగా మారాయని, దీని వల్ల ధరల పెంపు ప్రభావం కొంత మేర తగ్గిందని ఆయన చెప్పారు.