India vs South Africa 3rd T20I: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ ధర్మశాల వేదికగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోంది. ప్రస్తుతం 5 టీ20ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. తొలి మ్యాచ్‌ను భారత్ భారీగా గెలవగా, రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల దృష్టి సిరీస్‌లో ఆధిక్యం సాధించడంపై ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో రెండు మార్పులు చేసినట్లు తెలిపారు. ధర్మశాల పిచ్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
IND vs PAK U-19: సీనియర్లే కాదు జూనియర్స్ కూడా.. భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు..!
భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత్ 19 విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా 13 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. భారత్‌లో ఈ రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరగడం ఇది మూడేళ్ల తర్వాత. గతసారి 2022లో భారత్ 2-1తో సిరీస్ గెలిచింది. భారత్‌లో దక్షిణాఫ్రికా గెలిచిన ఏకైక టీ20 సిరీస్ 2015లో జరిగింది. ఇక నేటి ప్లేయింగ్ XI వివరాలు ఇలా ఉన్నాయి.
India vs Pakistan U19: మరోసారి నో షేక్‌హ్యాండ్స్.. చర్చనీయాంశమైన ఇండియా–పాక్ మ్యాచ్
భారత్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (VC), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేశ్ శర్మ (WK), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI:
రీజా హెడ్రిక్స్, క్వింటన్ డికాక్ (WK), ఎడెన్ మార్క్రమ్ (C), డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డోనోవన్ ఫెరెయిరా, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, ఎన్రిక్ నోర్త్జే, లుంగి ఎన్‌గిడీ, ఓట్నీల్ బార్ట్‌మన్.