IND vs PAK U-19: అండర్-19 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మరోసారి అభిమానులకు మజాను పంచింది. దుబాయ్ వేదికగా జరిగిన గ్రూప్–A మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 46.1 ఓవర్లకు 240 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుష్ మహత్రే 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అతడితోపాటు ఆరన్ జార్జ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 88 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ తో 85 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇక మధ్యలో కనిష్క్ చౌహాన్ 46 బంతుల్లో 46 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. వీరితోపాటు అబిగ్యాన్ కుండు (22), హెనిల్ పటేల్ (12) చివర్లో పరుగులు చేసి మంచి స్కోర్ సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో మొహమ్మద్ సయ్యం, అబ్దుల్ సుభాన్ చెరో మూడు వికెట్లు తీసినా.. భారత్ 240 పరుగుల స్కోరు సాధించింది.
Pamidi: దారుణం.. పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు..!
ఇక 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ అండర్-19 జట్టు 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు ఒత్తిడిలో పడింది. హుజైఫా అహ్సన్ 83 బంతుల్లో 70 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా సహకరించలేకపోయారు. భారత బౌలింగ్‌లో దీపేష్ దేవేంద్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు 7 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే కనిష్క్ చౌహాన్ కూడా 10 ఓవర్లలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కిషన్ సింగ్ రెండు వికెట్లతో విజయానికి తోడ్పడ్డాడు. ఇక ఈ మ్యాచ్ లో కూడా కురాళ్లు మరోసారి నో షేక్‌హ్యాండ్స్ పద్దతిని కొనసాగించారు.