God vs Job Deal: దేవుడితో 20 లక్షల ప్యాకేజీ ఒప్పందం.. హుండీలో విద్యార్థి లేఖ వైరల్..
- దేవుడితో ‘అగ్రిమెంట్’ చేసిన విద్యార్థి లేఖ వెలుగులోకి
- రూ.20 లక్షల ప్యాకేజీ, 9 CGPA కోసం ప్రత్యేక మొక్కు
- హుండీ లెక్కింపులో బయటపడిన ఆసక్తికర లేఖ
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘గివ్ అండ్ టేక్’ భక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God vs Job Deal: సాధారణంగా భక్తులు దేవుడిని కష్టాలు తీర్చమని వేడుకుంటారు. సమస్యల నుంచి బయటపడితే తలనీలాలు సమర్పిస్తామని, కానుకలు ఇస్తామని మొక్కుకోవడం హైందవ సంప్రదాయం. అయితే, ఏలూరు జిల్లాలో ఓ భక్తుడు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, “నాకు ఇది చేస్తే.. నేను నీకు అది చేస్తాను” అంటూ ఏకంగా భగవంతుడితో ముందస్తు ఒప్పందం (Agreement) కుదుర్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలోని శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల అనంతరం హుండీ లెక్కింపు చేపట్టగా, అందులో ఓ విద్యార్థి రాసిన వింత లేఖ వెలుగుచూసింది.
Pakistan Cricket: బాబర్‌ను తీసేయాలని చెప్తే, నన్నే తీసేశారు.. పాక్ మాజీ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ఆ లేఖలో సదరు విద్యార్థి తన కోరికలను అత్యంత స్పష్టంగా, ఒక అగ్రిమెంట్ తరహాలో పేర్కొన్నాడు. తనకు ఏడాదికి రూ. 20 లక్షల ప్యాకేజీతో కూడిన ఉద్యోగం రావాలని, అలాగే ఇటీవల జరిగిన పరీక్షల్లో 9 CGPA (సుమారు 85%-86%) మార్కులు సాధించాలని స్వామివారిని కోరుకున్నాడు. ఇక్కడి వరకు అంతా సాఫీగా ఉన్నా, ఆ లేఖలో ఆయన పెట్టిన కండిషన్ చూసి అధికారులు విస్తుపోయారు. ఈ కోరికలు నెరవేరితేనే తాను స్వామివారికి అభిషేకం చేసి, నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఆ తెల్ల కాగితంపై రాసి హుండీలో వేశాడు. అంటే, తన పని జరిగితేనే దేవుడికి మొక్కు చెల్లిస్తానని ఒక రకమైన ‘ఆఫర్’ ప్రకటించాడన్నమాట.
ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భక్తులు తమ మనసులోని కోరికలను దేవుడికి చెప్పుకోవడం సహజమే అయినా, ఇలా రాతపూర్వకమైన ఒప్పందం చేసుకోవడం వింతగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైందవ సంప్రదాయంలో కొబ్బరికాయ కొట్టడం నుంచి తలనీలాలు సమర్పించడం వరకు ప్రతి దాని వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. కానీ ఇప్పటి ‘జెన్-జీ’ (Gen Z) తరానికి భక్తి కూడా ఒక కోడింగ్‌లా, ‘గివ్ అండ్ టేక్’ పాలసీలా మారిపోయిందని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. తన భవిష్యత్తుపై ఉన్న గట్టి ఆశనో లేక అమాయకత్వమో కానీ, ఆ విద్యార్థి రాసిన ఈ ప్యాకేజీ లెటర్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం..
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!