Gaddar Awards 2025: గద్దర్ సినీ అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా తమ్మారెడ్డి.. జీవో విడుదల చేసిన సర్కార్..
- గద్దర్ అవార్డ్స్ 2025 జ్యూరీలో కీలక మార్పు
- కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ నియామకం
- జీవో నం.236 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- స్పెషల్ అవార్డ్స్ ఎంపికలో తమ్మారెడ్డి కమిటీకి బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (TGFA) – 2025కు సంబంధించి జ్యూరీ కమిటీలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత , దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజను నియమిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (I&PR) జీవో నంబర్ 236ను విడుదల చేసింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 4న విడుదల చేసిన మునుపటి ఉత్తర్వులకు (G.O.Rt. No.166) సవరణగా ఈ కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి.
ప్రజా గాయకుడు గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ప్రారంభించింది. సినీ రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాలను అందజేయనున్నారు. ముఖ్యంగా ‘స్పెషల్ అవార్డ్స్’ కేటగిరీలో విజేతలను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించనుంది. తమ్మారెడ్డి భరద్వాజకు సినీ పరిశ్రమపై ఉన్న అపారమైన అవగాహన, అనుభవం ఈ ఎంపిక ప్రక్రియకు మరింత వన్నె తెస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియామకానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read
Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!