Breaking News: మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు 6 నెలల జైలు శిక్ష.! హైకోర్టు సంచలన తీర్పు.!
- కోర్టు ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు జైలు శిక్ష
- భూ వివాదం తీర్పు అమలు చేయకపోవడంపై ఆగ్రహం
- ₹2,000 జరిమానాతో పాటు ఆరు నెలల శిక్ష
- డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గానూ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, భూహక్కులకు సంబంధించి గతంలో ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ, వివాదంలో ఉన్న ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే, న్యాయస్థానం నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం వ్యవస్థను అవమానించడమేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారులు చట్టానికి , న్యాయస్థానాలకు లోబడి పనిచేయాలని, ఆదేశాలను బేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. ఒక ఐఏఎస్ అధికారికి ఈ స్థాయిలో శిక్ష పడటంతో, ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసే అవకాశం ఉంది.
Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
తాజావార్తలు
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి