TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురువారం ఈ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్ 29గా నిర్ణయించారు. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఆన్లైన్లో దరఖాస్తు […]
TPCC Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు. […]
MLAs Defection Case: తెలంగాణ రాజకీయాల్లో మరో ఉత్కంఠభరిత ఘట్టం మొదలైంది.. పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును, శాసనసభ పటిష్టతను ప్రభావితం చేయనుంది అనడంలో సందేహం లేదు. గతంలో ఒక పార్టీ నుంచి గెలిచి, మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో కీలక పార్టీ అయిన BRS వర్కింగ్ […]
Jubilee Hills Bypoll Counting : రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠకు తెరపడనుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి […]
కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే! ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్‌గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్‌పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్‌గా రాజమౌళి […]
Fake Notes : మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹4.75 లక్షల నకిలీ ₹500 నోట్లను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి […]
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లిలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (USISPF) ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు […]
Fraud : హైదరాబాద్ మాదాపూర్‌లో నారాయణ విద్యాసంస్థల మాజీ ఉద్యోగి కొత్త దందాతో చర్చనీయాంశమయ్యాడు. మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో బిల్డింగ్ కట్టిస్తానంటూ టీ.శ్రీహరి అనే వ్యక్తి దాదాపు 40 మందిని లక్షల్లో మోసం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నారాయణ సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని నమ్మి ఉద్యోగులే శ్రీహరికి డబ్బులు పెట్టుబడి పెట్టారు. బిల్డింగ్‌లో ఫ్లాట్లు కేటాయిస్తానంటూ ఒక్కొక్కరి నుండి లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఆ డబ్బుతో శ్రీహరి మరో అపార్ట్మెంట్లో ఫ్లాట్లు […]
Koti Deepotsavam 2025 Day 11 : కార్తీకమాసం పర్వదినాల్లో భాగంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 2025 పదకొండవ రోజు కార్యక్రమాలు అద్భుత ఆధ్యాత్మిక వైభవంతో మెరిశాయి. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడగా, వేలాది భక్తులు ఒకే స్వరంతో “ఓం నమః శివాయ” జపిస్తూ వెలిగించిన దీపాలు ఆ ప్రాంగణాన్ని దివ్యజ్యోతి ప్రదేశంగా మార్చేశాయి. ప్రతి దీపం ఆత్మజ్యోతి సందేశాన్ని అందిస్తూ భక్తుల హృదయాలను పరవశింపజేసింది. 2012లో ఆరంభమైన ఈ […]
Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలు ఆసక్తికరమైన అంచనాలను వెలువరించాయి. ప్రముఖ సర్వే సంస్థలైన చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్‌పోల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 46 శాతం ఓట్లు లభించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ 41 శాతంతో కాంగ్రెస్ పార్టీకి […]