Minister Vivek : తెలంగాణ రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. మంత్రి వివేక్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సహ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై ఆయన చేసిన విమర్శలు సంచలనంగా నిలిచాయి. నిజామాబాద్‌లో మీడియాతో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. “నేను కష్టపడి పనిచేస్తున్నా, నాపై కుట్రలు జరుగుతున్నాయి. కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఎవరో నాకు తెలుసు,” అని వ్యాఖ్యానించారు. “మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి నాపై విమర్శలు […]
ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు.
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆత్మగౌరవ పోరాటంగా తీసుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్‌లో ప్రచార సభలో మాట్లాడుతూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “పచ్చి జూటా మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో బుల్డోజర్లతో పాలన చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాలి — కార్ కావాలా? లేక […]
అక్కడి హస్తం పార్టీలో ఐక్యత మేడిపండు చందమేనా? నాయకులు పైకి కౌగిలించుకుంటున్నట్టు కనిపిస్తున్నా… కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారా? జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు. వాళ్ళలో ఇద్దరు ఒక వర్గం, ఒకాయన మరో వర్గంగా రాజకీయం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడు తాజాగా ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకేనా? ఎవరా ముగ్గురు? ఏంటా మేడిపండు కథ? మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తాజాగా పార్టీ […]
ఆ మాజీ ఎమ్మెల్యేని ఫ్యాన్‌గాలి చల్లగా రా… రమ్మని పిలుస్తోందా? పొలిటికల్ ఎడారిలో ఒంటరి ప్రయాణం చేస్తున్న ఆ నేత కూడా….అటువైపు వెళితే కూల్ కూల్‌గా ఉంటుందని భావిస్తున్నారా? నీ అవసరం నాకు, నా అవసరం నీకు అన్న లెక్కలు కుదురుతున్నాయా? 2024 ఎన్నికల తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆ లీడర్ ఎవరు? ఏ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేయాలనుకుంటున్నారు? రాజకీయాల్లో జనరల్‌గా ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది. ఎంత తోపులైనా… […]
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టైం వచ్చిందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్న వత్తిడి పెరిగిపోతోందా? స్థానిక ఎన్నికల్లో కోటా సంగతి సరే… ముందు మీ చేతిలో ఉన్న ఆ పని సక్కంగా పూర్తిచేసి నిజాయితీగా వ్యవహరించమన్న వత్తిళ్ళు పెరిగిపోతున్నాయా? ఏ విషయంలో సోషల్ జస్టిస్ కోసం పార్టీ మీద ప్రెజర్ పెరుగుతోంది? అది అమలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఇందుకోసం 22 మంది పరిశీలకులను నియమించింది […]
విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకం తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుండగా, ఇప్పుడు ఉదయం అల్పాహారం కూడా అందించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తమిళనాడు మోడల్‌ను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఉదయం అల్పాహార పథకం’ అమలు కానుంది. దీనికి […]
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది విద్యార్థులకు గుడ్ న్యూస్. రాబోయే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.
మంచి తరుణం మించిన దొరకదు…., దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందాం…, దుమ్ము దులిపేద్దామన్నట్టుగా ఆ ఎమ్మెల్యే మనుషులు వసూళ్ళ పర్వానికి తెర లేపారా? మాట వినే అధికారులను డిప్యుటేషన్ మీద రప్పించుకుని మరీ… వ్యవహారాలు చక్కబెట్టేసుకుంటున్నారా? అసలక్కడ ఉద్యోగం చేయాలంటేనే… రెగ్యులర్ ఎంప్లాయిస్ భయపడే పరిస్థితి వచ్చిందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం. పరిధి చిన్నదే అయినా… పొలిటికల్‌గా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్. ఇక్కడి నుంచి 2024ఎన్నికల్లో జనసేన తరపున […]