Cyberabad Traffic Alert: 2026 నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ నగర వాసులకు విజ్ఞప్తి చేసింది. వేడుకల పేరుతో అతిగా ప్రవర్తించే వారు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డిసెంబర్ 31 రాత్రి సైబరాబాద్ పరిధిలోని అన్ని ప్రధాన రహదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం 8 గంటల నుంచే సైబరాబాద్ వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మితిమీరిన వేగాన్ని అరికట్టేందుకు 100కు పైగా ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు అత్యాధునిక కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు.
యూనిఫాం & డాక్యుమెంట్స్: క్యాబ్, ట్యాక్సీ , ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫాం ధరించాలి. వాహనానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి. ప్రయాణికులు కోరినప్పుడు రైడ్‌ను నిరాకరిస్తే (Refusal) ఈ-చలాన్ ద్వారా రూ. 500 జరిమానా విధిస్తారు. పండుగ పేరుతో ప్రయాణికుల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
మద్యం తాగి వాహనం నడిపి పట్టుబడితే రూ. 10,000 జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు. వాహనాన్ని తక్షణమే సీజ్ చేస్తారు. నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని ఆర్టీఓ అధికారులకు సిఫార్సు చేస్తారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తే, కొత్త శిక్షా స్మృతి (BNS) ప్రకారం బాధ్యులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
బార్ , పబ్‌ల నిర్వాహకులు తమ కస్టమర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా చూడాలి. తాగి వాహనం నడిపే వారికి సహకరించినా లేదా వారికి ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు (Drivers/Cabs) చేయకపోయినా సదరు యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. మైనర్లు వాహనం నడిపితే వాహన యజమాని , డ్రైవర్ ఇద్దరిపై కేసులు పెడతారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన డాక్యుమెంట్లు లేని వాహనాలను వెంటనే సీజ్ చేసి ఆర్టీఓకు తరలిస్తారు. వాహనాల్లో భారీ శబ్దంతో మ్యూజిక్ పెట్టడం నిషేధం.
ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం , ర్యాష్ డ్రైవింగ్‌పై డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచుతారు. న్యూ ఇయర్ వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, మద్యం సేవించిన వారు డ్రైవర్లను నియమించుకోవాలని లేదా క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
Virat Kohli: అభిమానులకు శుభవార్త.. మరో మ్యాచ్ ఆడనున్న విరాట్ కోహ్లీ!