Minister Seethakka : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుతో ఆ పార్టీ నాయకులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఫలితాలపై మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక రాజకీయాలన్నీ ప్రజలకు స్పష్టంగా తెలుసు అని అన్నారు. దశాబ్దకాలం పాటు ఏ పని చేయని బీఆర్ఎస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా, జూబ్లీహిల్స్ ఓటర్లు విశ్వసించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజలతో పాటు మంత్రివర్గం, కార్యకర్తలు పటిష్ఠంగా నిలిచినందునే ఈ విజయఫలితం సాధ్యమైందని సీతక్క తెలిపింది. కాంగ్రెస్ […]
హైదరాబాద్ నగరం మరోసారి భక్తి జ్వాలతో ప్రకాశించింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించిన కోటి దీపోత్సవం 2025 పదమూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా ముగిసింది.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే…. ఆ క్రెడిట్ ఎవరి ఖాతాలోకి? ఒకవేళ తేడా పడితే బద్నాం అయ్యేది ఎవరు? చివర్లో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయి అంతా తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎక్కడ దొరుకుతాడా అని కాచుక్కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్ సహా… నాయకులు అందర్నీ గల్లీ గల్లీ తిప్పింది. […]
జూబ్లీహిల్స్ పేరు వింటేనే… తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాళ్ళలో కనిపించని కంగారు పెరిగిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవుతామని గొప్పలు చెప్పిన కాషాయ దళంలో ఇప్పుడు భయం పెరిగిపోవడానికి కారణం ఏంటి? జూబ్లీహిల్స్‌లో గెలవలేమని కౌంటింగ్‌కు ముందే వాళ్ళే డిసైడయ్యాక కూడా ఇంకా ఆరాటం దేని కోసం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్ఎస్ది గెలుపు పోరాటమైతే… బీజేపీది ఉనికి కోసం ఆరాటం. ముందంతా… ఇది త్రిముఖ పోరాటమని బీరాలు […]
Vemulawada : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ కారణంగా తాత్కాలికంగా దర్శనాలను రద్దు చేసింది. అయితే, కార్తీక మాసంలో రాజన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ప్రధాన ఆలయం మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండానే బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేయడంపై తీవ్ర […]
Kachiguda Railway Track : హైదరాబాద్ నగరంలో గురువారం చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. కాచిగూడ రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి ఓ కారు నిలిపివేయడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రైల్వే మార్గంలో కారు కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాచిగూడ పోలీసులు, రైల్వే సెక్యూరిటీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రైల్వే ట్రాక్‌పై నిలిచిన కారును అక్కడి నుంచి తొలగించేందుకు […]
ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్.. శార్దూల్ ఠాకూర్, రుదర్‌ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..! IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై […]
డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ళు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టాయా? పాత, కొత్త పోరాటం మళ్ళీ మొదలైందా? ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను గుర్తు చేస్తూ…. పాత కాంగ్రెస్ నాయకులు ఫీలైపోతున్నారా? ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేకి ఇవేం పట్టడం లేదా? ఎక్కడ జరుగుతోందా వర్గపోరు? దాని మూలాలు ఎక్కడున్నాయి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ళ పంచాయితీ తీవ్రమవుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యనే… […]
TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురువారం ఈ ప్రకటన చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ 15వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు నవంబర్ 29గా నిర్ణయించారు. జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఆన్లైన్లో దరఖాస్తు […]
TPCC Mahesh Goud : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో సోనియా గాంధీ చేసిన పాత్రను గుర్తు చేసుకుంటూ, “సోనియా మహా దేవత లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు” అని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దండుకుంది. ప్రజల ఆస్తులను ద్వంసం చేసి, నేతలు డబ్బులు దోచుకెళ్లారు. […]