Damodara Raja Narasimha : ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడటం ఇప్పుడేమో, అయితే గత పదేళ్ల పాటు ఈ పథకాన్ని నిర్లక్ష్యంగా నిర్వహించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. Komatireddy Venkat Reddy : రేపు నల్గొండలో పర్యటించనున్న మంత్రి కోమటిరెడ్డి […]
కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు. రాజమండ్రిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. […]
Bhatti Vikramarka : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని, ప్రజలు ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ నుండి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమవుతాయని […]
Komatireddy Venkat Reddy : రేపు (20.01.2025) నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యనటలో భాగంగా ఆయన కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి చేరుకోనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉదయం 10.15 గంటలకు.. దర్వేశిపురం గ్రామంలో కొత్తగా ఎన్నికైన […]
Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని […]
హైదరాబాద్లో అఫ్జల్గంజ్ కాల్పుల దుండగులు.. అఫ్జల్గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. […]
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రెండవ దశలో సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మేడ్చల్, శామీర్ పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు హైదరాబాద్ ప్రజల సౌకర్యవంతమైన ప్రయాణానికి కొత్త మెట్రో మార్గాలను రూపొందించే కసరత్తును ప్రారంభించారు. ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ); జేబీఎస్ – శామీర్ […]
DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్ఘాట్లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి […]
Kishan Reddy : తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. ఆదివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయం(State office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు.. కాషాయ పార్టీలో చేరిన ఖైరతాబాద్కు చెందిన పలువురికి పార్టీ కండువా కప్పి.. ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో పనులు […]
Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈనెల 23 నుండి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్ […]