Women Youtuber : సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు, యూట్యూబర్ గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది. జాతరలో జనసందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా, కొన్ని సార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి, కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో […]
Gun Fire : అమెరికాలో ఉన్న ఒక యువకుడు పై దుండగులు కాల్పులు జరపగా, యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు, రవితేజ అనే పేరు గల హైద్రాబాద్ పట్నం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆర్కేపురం డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతం లో నివసించేవాడు. 2022 మార్చిలో, రవితేజ అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇటీవల, […]
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ […]
నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. అయితే, గత నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ హౌస్ ను ట్రంప్ వీడాడు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు […]
Weather Updates : సంక్రాంతి పండుగ ముగిసినా, తెలుగు రాష్ట్రాలను చలి వదలడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, ప్రజలు ఆహారపు జాగ్రత్తలు పాటించేందుకు, వేడి బట్టలు ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ: తెలంగాణలో సోమవారం తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత అధికంగా నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. […]
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ […]
NTV Daily Astrology as on 20th January 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన. మొదటి రోజు స్విట్జర్లాండ్‌లో భారత్ హైకమిషనర్‌తో భేటీ. పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు. ఎన్నారైలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం బృందం. దావోస్ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, అధికారులు. ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన. సింగపూర్ నుంచి దావోస్‌కి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. […]
Etela Rajender : నా రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదని, ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదన్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 7 నుంచి 10 శాతం కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని, ఇళ్లలో ఉండే వాళ్ళు కూడా దుకాణాలు ఓపెన్ చేశారన్నారు. మళ్లీ దొరుకుతదొ దొరకదొ అన్నట్లు దోచుకుంటున్న ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపిని […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి ఆదివారం రాత్రి సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు దావోస్ కు బయల్దేరనున్నారు. సోమవారం దావోస్ కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను […]