గన్నవరం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీ ఆఫీస్‌ని తగలబెట్టిన కేసులో సీన్ ఎందుకు రివర్స్ అయింది? అధికారంలో ఉండి కూడా ఫిర్యాదు దారుడిని కాపాడుకోలేకపోయారా? టీడీపీ పెద్దలు వల్లభనేని వంశీని లైట్ తీసుకుని బోల్తా పడ్డారా? గన్నవరం గరం గరంకు కారకులెవరు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజక వర్గాల్లో గన్నవరం ఫస్ట్ లిస్ట్‌లో ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ… 2019- 2024 మధ్య వ్యవహరించిన తీరే ఆ స్పెషల్ ఫోకస్‌కు కారణం అనేది పార్టీ వర్గాల మాట. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… 2019లో వైసిపి అధికారంలోకి రావడంతో జగన్ కు జై కొట్టి చంద్రబాబు, లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యులపై హద్దులు దాటి మాట్లాడారన్నది ఆ పార్టీ ప్రధాన ఆరోపణ. దీంతో టీడీపీ అధికారంలోకి వస్తే హిట్ లిస్ట్ లీడర్స్‌లో వంశీ పేరును మొదటి వరుసలో పెట్టిందట అధిష్టానం. అనుకున్నట్టుగానే… అధికారంలోకి రావటంతోనే గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసు బయటకి తీసి వల్లభనేని వంశీ సహా 88 మందిపై కేసు పెట్టారు. పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు విషయంలో ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో వంశీ సహా నియోజక వర్గ టీడీపీ నేతలు అందరూ సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. అటు కేసులో అరెస్ట్‌ల పరంపర కూడా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది వంశీ వర్గీయులను జైలుకి వెళ్ళారు. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రానుంది. తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ అందరిలో పెరుగుతున్న టైంలోనే…హఠాత్తుగా ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు, తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఘటన జరిగినప్పుడు తాను లేనని, పోలీసులు బలవంతంగా సాక్షి సంతకం చేయమని చెప్పి చేయించుకున్నారంటూ… కోర్టులో అఫిడవిట్ ఇవ్వటంతో టీడీపీ నేతలకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయిందట.
Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
అలాగే పోలీసుల నుంచి తనకి రక్షణ కల్పించాలంటూ కోర్ట్‌కు విన్నవించుకోవడంతో… ఏం చేయాలో అర్ధంగాక టీడీపీ అధిష్టానం మైండ్ బ్లాంక్ అయినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్న కేసులోనే పరిస్థితి అలా ఉంటే మిగతా వాటి సంగతేంటని కేడర్ కూడా అసహనంగా చూస్తున్నట్టు సమాచారం. వంశీ వ్యవహారంలో సీన్ రివర్స్ అవటానికి కారణాలు ఏంటంటూ ఇప్పుడు లోతైన చర్చ జరుగుతోందట పార్టీ సర్కిల్స్‌లో. ప్రెస్టీజియస్‌గా భావించిన కేసు విషయంలో గన్నవరం టీడీపీ నాయకత్వం నిర్లక్ష్యమే కారణం కావచ్చన్న చర్చ కూడా జరుగుతోందట. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ నియోజక వర్గంలో వేరే ఎమ్మెల్యేల పర్యటనలు, అక్రమ మైనింగ్ వ్యవహారంలో వంశీ అనుచరులకు ప్రస్తుత మంత్రి పార్థసారధి సహకరిస్తున్నట్టు అనేక ఆరోపణలు చేశారు. అన్ని విషయాలపై స్పందించే యార్లగడ్డ ఈ కేసు విషయంలో అప్రమత్తంగా ఎందుకు వ్యవహరించలేదని ప్రశ్నించుకుంటున్నారు పార్టీ లీడర్స్. పార్టీకే కాకుండా తనకి కూడా చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వంశీపై ఉన్న కేసు విషయంలో యార్లగడ్డ మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది లోకల్ టాక్. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న సత్యవర్థన్ అనేక ఆర్థిక, ఇతర ఇబ్బందులతో సతమతం అవుతున్నా గన్నవరం టీడీపీ నాయకత్వం పట్టించుకోలేదని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవర్ధన్ ను వంశీ మనుషులు తనకి అనుకూలంగా మార్చుకుని ఉండవచ్చన్న అంచనాలున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వంశీకి అనుకూలంగా సత్యవర్ధన్ అఫిడవిట్ ఇవ్వటాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నయట. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఈ పరిణామాన్ని సీరియస్ గా తీసుకోవాలని అధిష్టానం దగ్గరకి కొందరు లీడర్లు తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వంశీని లైట్ తీసుకోవటం కూడా కీలక కేసు విషయంలో సీన్ రివర్స్ అవటానికి కారణంగా భావిస్తున్నారట. అధిష్టానం కూడా ఈ పరిస్థితి రావటానికి కారణాలు, కారకులు ఎవరు అనే విషయంపై పోస్ట్ మార్టం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందులో చివరికి ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి మరి.
India Bangladesh: భారత్‌పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..