Harish Rao : జనాభా నియంత్రణ చేస్తూ, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు మరింత వృద్ధి చెందేలా చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తే “చోటి సోచ్” అని అవమానించడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.ఈ వ్యాఖ్యలు గౌరవ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చోటి సోచ్ కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలి. సెస్సులు, సర్ ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని, చెబుతున్నది 41శాతం అయినా, రాష్ట్రాలకు నిజంగా అందుతున్నది మాత్రం 30శాతమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తే, రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసేవీలుంటుందని, కానీ సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తన ఇష్టం వచ్చిన రీతిలో, అంటే తమకు ఇష్టమైన రాష్ట్రాలకు ఇవ్వడం, తమకు అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపడం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఇలా ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకుని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది.
Atchannaidu: ఏపీలో లక్షల్లో కోళ్లు మృతి.. ఆందోళన అవసరం లేదన్న మంత్రి
రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దం కాదా? ఇదేనా మీరు వల్లించే టీమ్ ఇండియా స్పూర్తి? అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచామని ప్రచారం చేసుకుంటూ, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రెండు రకాలుగా నష్టపోతున్నది వాస్తవం కాదా?అని హరీష్ రావు అన్నారు. రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడితే అవమానకరంగా మాట్లాడటం స్థాయికి తగదు. పీయూష్ గోయల్ గారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గ్రోత్ ఇంజన్ గా ఉన్న తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధే.. భారత దేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నామన్నారు హరీష్ రావు.
Chinese Apps: భారత్‌లోకి మళ్లీ తిరిగొచ్చిన 36 చైనా యాప్‌లు..