YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లు ఉంది వీళ్ల వ్యవహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మన రాష్ట్ర పురోగతి అట్టడుగున ఉందని..కానీ వృద్ధిరేటులో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు చెప్తున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు.. చంద్రబాబు ఎవరికి చెవిలో పూలు పెడుతున్నారు.. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదోవ పట్టాయన్నారు.. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లుగా టీడీపీ నేతల వ్యవహారం ఉందని విమర్శించారు.. వనరులు మొత్తం దోచేస్తున్నారన్నారు.. ఆయనకు ఒక విమానం.. దాంతో ఒక హెలికాఫ్టర్ ఉందని.. లోకేష్, పవన్‌కు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నారు. కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తాడు.. తర్వాత రోజు ఉదయాన్నే విజయవాడ వస్తారని విమర్శించారు.. ప్రైవేట్ ఫ్లైట్ కొలంబో వెళ్ళి మ్యాచ్ చూస్తారు.. టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా?.. నేను కూడా మ్యాచ్ టీవీలోనే చూశానన్నారు. అప్పులపై మళ్ళీ మళ్ళీ గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని.. ఎన్నిసార్లు సాక్ష్యాలు, ఆధారాలు చూపినా అదే అబద్ధాలు ఆడుతున్నారన్నారు.. కుక్క తోక వంకర అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం ఉందని తీవ్రంగా విమర్శించారు.. ప్రజలకు తెలిసిపోతుంది అని బడ్జెట్ పేపర్స్ లో అప్పుల టేబుల్ ఎత్తివేశారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ ఇతర నివేదికల్లో ఏమీ చేయలేరని తెలిపారు..
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ఎవరి హయాంలో ఎంత అప్పు అనేది కాగ్ విడుదల చేసిన లెక్కలు చూసినా కనిపిస్తుందని క్లియర్ గా ఉంటుందని మాజీ సీఎం జగన్ అన్నారు.. 2023-24 కు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు మొత్తం రూ. 2, 57, 509 కోట్లు.. చంద్రబాబు దిగితే నాటికి రూ. 3.90 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.. లెక్కలు ఎంత క్లియర్‌గా ఉన్నా చంద్రబాబు మాత్రం గ్లోబెల్స్ ప్రచారం ఆపరని.. తమకు రూ. 9 లక్షల కోట్లు అప్పులు మిగిల్చి వెళ్లారని ఘోరంగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు… ఈ ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో చేసిన అప్పులు రూ. 3.17, 448 కోట్లు అని ఆరోపించారు.. వాస్తవాలు ఆధారాలతో కనిపిస్తున్నా బడ్జెట్ డాక్యుమెంట్స్‌తో గేమ్ ఆడుతూనే ఉంటారన్నారు..
తాజావార్తలు
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!