మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి దాదాపుగా ఖరారైందా? కేబినెట్ ర్యాంక్‌తో ఆయన్ని గౌరవించాలని అనుకుంటున్నారా? కానీ… ఆయన మాత్రం ఆ కొత్త పోస్ట్‌తో అంత సంతృప్తిగా లేరా? అసలు పార్టీ ఏం ఆఫర్ చేసింది? ఆ విషయంలో కూడా ఎమ్మెల్యే ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? దాని మీద కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు చివరికి పీసీసీ పోస్ట్‌ల విషయంలో కూడా ఎప్పటికప్పుడు వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా…. కేబినెట్ విస్తరణ సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి కామన్‌గా వినిపిస్తున్న పేరు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఈక్వేషన్స్, కేలిక్యులేషన్స్‌తో నాకు సంబంధం లేదు. విస్తరణలో ఖచ్చితంగా నా బెర్త్ నాకు కావాల్సిందేనన్నది ఆయన వెర్షన్. అసలు పార్టీ మారిపోయి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరేటప్పుడే ఆయనకు మంత్రి పదవి ప్రామిస్ దక్కిందన్న టాక్ సైతం నడుస్తోంది. అందుకు తగ్గట్టే… ఎప్పటికప్పుడు రాజగోపాల్‌రెడ్డి తన డిమాండ్‌ను తెరపైకి తెస్తూ… నేనున్నానని గుర్తు చేస్తూనే ఉన్నారు, తనవంతు ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. కానీ… అసలు విస్తరణ ఊసే లేనప్పుడు ఇక ఆయనకు మంత్రి పదవి ఎక్కడిదన్న చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవల రాష్ట్ర పార్టీ పెద్దల్ని ఢిల్లీ పిలిచి కొంత మేర పదవుల కసరత్తు చేసినా… అవి పీసీసీ వరకే పరిమితం అయ్యాయేతప్ప… కేబినెట్ దాకా రాలేదని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే కేబినెట్ విస్తరణ గురించి ఆలోచిద్దామని ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో తాజాగా జరుగుతున్న ప్రచారం పొలిటికల్‌గా కలకలం రేపుతోంది.
కేబినెట్ బెర్త్ ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అందుకు బదులు మరో పదవిని ఆఫర్ చేసినట్టు సమాచారం. రాజగోపాల్‌కు ప్రభుత్వ చీఫ్‌విప్ పదవి ఇవ్వజూపినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే… ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో మూడు ప్రభుత్వ విప్ పదవుల్ని భర్తీ చేశారు తప్ప ఏడాదిగా చీఫ్ విప్ అలాగే ఉంది. కేబినెట్ ర్యాంక్ ఉండే ఆ పోస్ట్‌ని రాజగోపాల్‌రెడ్డికి ఇవ్వాలనుకుంటోందట అధిష్టానం. అందుకు ఆయన సుముఖంగా ఉన్నారా… అంటే నో అన్నదే సమాధానంగా తెలుస్తోంది. నేను కేబినెట్ బెర్త్ అడిగితే… అందుకు బదులు సమాన హోదా ఇస్తామనడం ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ప్రశ్నగా చెప్పుకుంటున్నారు. ఈ ప్రతిపాదన విషయంలో పూర్తి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. పైగా… ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే జిల్లా నుంచి మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే జిల్లాకు మూడు మంత్రి పదవులు, అదీ ముగ్గురూ రెడ్లు, అందులోనూ అన్నదమ్ములకు ఎలా ఇవ్వాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఈ లెక్కలతోనే… రాజగోపాల్‌రెడ్డికి చీఫ్‌విప్ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న సమాచారంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి ఏం చేయబోతున్నారు? ఆయన వ్యూహం ఏంటని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.