Google : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్, భారతదేశంలోని వరాహా అనే స్టార్టప్‌తో కార్బన్ డయాక్సైడ్ తొలగింపు (CDR) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ వరాహా నుండి కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేస్తుంది. వరాహా వ్యవసాయ వ్యర్థాలను బయోచార్గా మార్చే ప్రక్రియలో నిమగ్నమై ఉంది. బయోచార్ అనేది బొగ్గు ఒక రూపం, ఇది వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను సేకరించి మట్టిలో నిల్వ చేస్తుంది. గూగుల్, వరాహా మధ్య కుదిరిన ఈ ఒప్పందం […]
Tummala Nageswara Rao : పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులకు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు నాట్లు వేసేటప్పుడు ఇచ్చాం అంటున్న వారికి, ప్రతి పంట కాలములో రైతుబంధు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పటిదాకా ఇచ్చారో తెలియకపోతే ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. రైతుబంధు పేరు చెప్పి పంటల భీమా, వ్యవసాయ యాంత్రికరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది […]
Green Corridor : నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి నుండి లక్డీకపూల్‌లోని గ్లెనీగిల్స్ గ్లోబల్ ఆసుపత్రికి గుండెను తరలించాల్సి ఉండగా.. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులను ఆశ్రయించారు. ఇంకేం.. నగరంలో మెట్రో గ్రీన్ ఛానెల్ ఏర్పాటైంది. హైదరాబాద్ మెట్రో రైల్ 2025 జనవరి 17న సాయంత్రం 9:30 గంటలకు ఓ ప్రాణాపాయమైన పరిస్థితిని సమర్థవంతంగా పరిష్కరించేందుకు గ్రీన్ కారిడార్ అందించింది. ఈ కారిడార్ ద్వారా ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రి […]
TPCC mahesh Kumar Goud : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో పర్యటన కొనసాగుతోంది. విక్టోరియా రాష్ట్రం మెల్బోర్న్ నగరంలో ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైంది రాష్ట్ర బృందం. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆ రాష్ట్ర అధికారులతో క్రీడలపై రాష్ట్ర బృందం చర్చించింది. క్రీడలు, మౌళిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం. ఆస్ట్రేలియాలో […]
ఏపీకి ముందు ముందు మంచి కాలం ఉంది ఆంధ్రప్రదేశ్‌కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు .. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్న్యూ్స్ చెప్పింది. […]
Uttam Kumar Reddy : కృష్ణా జలాలను పదేండ్లుగా పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. కృష్ణా జలాల నదీ వివాదానికి సంబంధించి తెలంగాణలో ఉన్న పరివాహక ప్రాంతం, ఆయకట్టు ఆధారంగా వాటాలు పెరగాలని కాంగ్రెస్ పార్టీ తొలినుంచి పోరాటం చేస్తూ వస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నదీ జలాల వాటాలు దక్కించుకోవడంలో తొలి పదేండ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. […]
Group 2 Key : తెలంగాణలో ఇటీవల నిర్వహించిన TGPSC గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. టీజీపీఎస్సీ ఇటీవల (జనవరి 8న) గ్రూప్-3 పరీక్ష ఆన్సర్ కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల కోసం టీజీపీఎస్సీ సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల ద్వారా 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. రెండు రోజులపాటు […]
Ration Card Verification : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇటీవల కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మరింత దృష్టిలో పెట్టుకుని, జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నేతృత్వంలో 150 డివిజన్లలో దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్ కార్డుల […]
Kadiyam Srihari : జనగామ జిల్లా యశ్వంతపూర్ శివారులోని శ్రీ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 10 సంవత్సరాల అధికార కాలంలో కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఆస్తులు సంపాదించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో […]
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించబడింది. కోర్టు తన నిర్ణయంతో పాటు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని […]