HMWSSB : హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. రెండు రోజులు నీళ్లు బంద్
- హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17-18న తాగునీటి సరఫరా అంతరాయం
- గోదావరి వాటర్ సప్లై ఫేజ్-1 మరమ్మతులు
- నీటి నిల్వలు చేసుకోవాలని హెచ్చరిక చేసిన HMWSSB అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HMWSSB : హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 17న (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 18న (మంగళవారం) ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరగనున్నాయి. ఈ సమయంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
పంపింగ్ స్టేషన్ వద్ద చేపట్టనున్న పనులు:
Also Read
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌కు 900 ఎంఎం డయా వాల్వులు (బీఎఫ్ & ఎన్ఆర్సీ) అమర్చనున్నారు. మొత్తం 24 గంటల పాటు మరమ్మతులు కొనసాగుతాయి.
నీటి సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలు:
🔹 ఓ అండ్ ఎం డివిజన్-6: ఎస్.ఆర్.నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్ రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-9: కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మ బండ, మూసాపేట్, భరత్ నగర్, మోతీనగర్, గాయత్రి నగర్, బాబానగర్, కేపీహెచ్ బీ, బాలాజీ నగర్, హస్మత్ పేట్.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-12: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-13: అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-14: చెర్లపల్లి, సాయిబాబా నగర్, రాధిక.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-15: కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు).
🔹 ఓ అండ్ ఎం డివిజన్-17: హఫీజ్ పేట్, మియాపూర్.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-21: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం.
🔹 ఓ అండ్ ఎం డివిజన్-22: నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం.
🔹 ట్రాన్స్ మిషన్ డివిజన్-4: ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్ రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీనగర్ ఎయిమ్స్.
🔹 ఆర్‌డబ్ల్యూ ఎస్ ఆఫ్ టేక్స్ ప్రాంతాలు: ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్ పూర్ (మేడ్చల్/ శామీర్ పేట్).
HMWSSB అధికారులు ప్రజలను ముందస్తుగా నీటి నిల్వలు చేసుకోవాలని, ఈ అసౌకర్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు
తాజావార్తలు
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!