ఆ జూనియర్ మంత్రికి తత్వం బోధపడడం లేదా? పార్టీ, ప్రభుత్వం లైన్‌ను అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డారా? అనుకోకుండా వచ్చిన, చాలా మంది జూనియర్స్‌కు కలగానే మిగిలిపోయిన అవకాశాన్ని ఆయన చేజేతులా పాడు చేసుకుంటున్నారా? మినిమం పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ మంత్రివర్యులు ఎవరు? ఆయన సమస్య ఏంటి? వాసంశెట్టి సుభాష్, ఏపీ కార్మిక శాఖ మంత్రి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచారు.సామాజిక సమీకరణల కోణంలో మంత్రిగా అవకాశం వచ్చింది.. అయితే సుభాష్ తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడమే తప్ప.. పార్టీలో, ప్రభుత్వంలో తన మార్కు చూపించలేకపోతున్నారనేది నియోజకవర్గంలో ఓపెన్ టాక్. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు నమోదు విషయంలో ఆయన సీరియస్‌గా ఫోకస్ పెట్టలేదని స్వయంగా సీఎం చంద్రబాబే మందలించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాలన్నిటిలో అతి తక్కువ ఓట్లు నమోదు చేయించిన సెగ్మెంట్ రామచంద్రపురం అని స్వయంగా అధినేత ప్రకటించారు.. టెలి కాన్ఫరెన్స్ లో గ్రామస్థాయి నాయకులు ఉండగానే రాజకీయాల్లో సీరియస్ ఉండాలంటూ మంత్రికి క్లాస్ పీకారు చంద్రబాబు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరూ ఏం చేయలేరన్నది సీఎం అభిప్రాయం. ఇక తాజాగా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు ముఖ్యమంత్రి. అందులో సుభాష్‌ది చిట్ట చివరి స్థానం. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 25 మంది ఉన్న క్యాబినెట్ లో ఆయన లాస్ట్ పర్ఫార్మర్.. దానిపై కూడా పార్టీలో ప్రభుత్వంలో ఆసక్తికర చర్చ జరుగుతోందట.. యువ మంత్రి ఎంత బాగా పనిచేయాలి, ఎలా చేస్తున్నారని అంటున్నట్టు సమాచారం.
అందరికీ అవకాశాలు రావు వచ్చినవారు సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి క్యాబినెట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సుభాష్ మాత్రమే ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో జిల్లా పై పూర్తిగా ఫోకస్ చేసే అవకాశం ఉండదు. ఇక మిగిలిన ఏకైక మంత్రి సుభాష్.. పార్టీలోను, ప్రభుత్వంలోనూ మోస్ట్ సబ్ జూనియర్ అయినప్పటికీ లక్ కలిసి రావడంతో అమాత్య హోదా లభించింది.. సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో పక్కకు తప్పుకున్నారు. అలాంటప్పుడు అందరినీ సమన్వయ పరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా సుభాష్ కి ఉంది.. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు. మంత్రి ఎందుకు సీరియస్ గా పని చేయలేకపోతున్నారు.. కార్మిక శాఖపై పట్టు కోల్పోయారా అని చెవులు కొరుక్కుంటున్నారట పార్టీ నేతలు. గట్టిగా పర్ఫామెన్స్ ఇచ్చి ప్రమోషన్ పొందాల్సింది పోయి ఇలా డిమోషన్ లిస్టులోకి వెళ్ళిపోతున్నారేంటని అనుచరులు తెగ ఫీల్ అయిపోతున్నారట… అసలు మంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని ఆరాలు తీసే వాళ్ళు పెరుగుతున్నారు. పరిస్థితి చేయి దాటి పోతే చంద్రబాబు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని కూడా పార్టీలో సీనియర్లు గుసగుసలు ఆడుకుంటున్నారు ప్రత్యామ్నాయం వైపు చూడకుండానే పరిస్థితి చక్క దిద్దుకోవాలని గుర్తు చేస్తున్నారు.. అన్ని సందర్భాలలో సామాజిక వర్గాలు సమీకరణాలు వర్కౌట్ అవ్వవని, ఫస్ట్ టైం మంత్రులైన మిగతా వారిని చూసైనా సుభాష్ సెట్ రైట్ అవ్వాలి కదా అంటున్నారట కొందరు. మొత్తానికి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఏడు నెలల్లోనే అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా సుభాష్ పూర్ పర్ఫామెన్స్ ఇస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది. యంగ్ మినిస్టర్ ఇకనైనా దిద్దుకుంటారో… లేక సాగనంపేదాకా తెచ్చుకుంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.