Vijayawada-Hyderabad Highway: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలోని గొల్లగట్టుపై ప్రఖ్యాత పెద్దగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతర ఐదు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.
పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంది. అయితే, ఈ ఉత్సవానికి యాదవులతో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలంగాణలో మేడారం జాతర తరువాత అత్యధిక మంది భక్తులు హాజరవుతుందిగా పేరొందిన ఈ జాతరలో, ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ట్రాఫిక్ నియంత్రణ & మార్గ మార్పులు
పెద్దగట్టు జాతర జరుగుతున్న ప్రాంతం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో ఉన్నందున, భారీ భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే వాహనాల రూట్: నార్కెట్‌పల్లి → నల్గొండ → కోదాడ ద్వారా మళ్లింపు.
విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చే వాహనాల రూట్: కోదాడ → నల్గొండ → నార్కెట్‌పల్లి ద్వారా మళ్లింపు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు రెండు రోజుల పాటు అమల్లో ఉంటాయి. వాహనదారులు ముందస్తుగా ఈ మార్గ మార్పులను గమనించి సహకరించాలనీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Jagga Reddy : రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబంది