నేడు కర్ణాటకలో కాంగ్రెస్ జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనూ రాజ్యాంగంపై దాడి ప్రధాన ప్రతిపక్షం, విపక్షాల మధ్య రాజకీయ పోరుకు దారి తీసింది. దీంతో ఈరోజు (జనవరి 21) కర్ణాటకలోని బెలగావిలో జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ ర్యాలీతో కాంగ్రెస్ ప్రారంభించనుంది. అలాగే, ఈ నెల 27వ తేదీన మధ్యప్రదేశ్లోని మోవ్లోని బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలం దగ్గర రాజ్యాంగ సంస్థలను బీజేపీ- ఆర్ఎస్ఎస్ స్వాధీనం […]
Grama Sabalu : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి అమలు చేయబోయే నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గతంలో అందిన దరఖాస్తుల ఆధారంగా ఫీల్డ్ సర్వే బృందాలు లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారి వివరాలను సేకరించి, అర్హుల జాబితాను రూపొందించి సంబంధిత అధికారులకు అందించారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు స్థాయి సభల్లో బహిరంగంగా చదవనున్నారు. జాబితాలో ఉన్న పేర్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, ఆయా అభ్యంతరాలను స్వీకరించేందుకు […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (WEF) పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పావిలియన్ను ప్రారంభించారు. ఈరోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న దావోస్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ దేశాల ప్రముఖులతో పాటు ఇండియాకు చెందిన గౌరవ అతిథులతో భేటీ […]
NTV Daily Astrology as on 21st January 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
నేటి నుంచి తెలంగాణలో గ్రామ సభలు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక. లబ్దిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటన. అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 24 వరకు జరగనున్న గ్రామ సభలు. దావోస్లో సీఎం చంద్రబాబు బృందం రెండో రోజు పర్యటన. సీఐఐ సెషన్లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చలో పాల్గొననున్న […]
Jupally Krishna Rao : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణ రావ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ నేటి సమాజంలో, ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అన్నారు. గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు. అభివృద్ధి […]
Madhavaram Krishna Rao : గడిచిన సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధిని అటుకెక్కించి ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్ పల్లి కె.పి.హెచ్.బి కాలనీలోని ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డ్ అధికారులు సీజ్ చేసిన విషయాన్ని తెలుసుకొని స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు తో కలిపి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వేణుగోపాల […]
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది. 65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు […]
World Economic Forum : ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి […]
KTR : రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం, సంక్రాంతి హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీకి తేల్చి చెప్పారు పోలీసులు. రేపటి మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ […]