Jagga Reddy : బీజేపీ నేతలు.. బండి సంజయ్ లాంటి వాళ్ళకు అవగాహన కోసం కొన్ని విషయాలు చెప్పాలన్నారని, రాహుల్ గాంధీ అంటే చరిత్ర.. మహా సంగ్రామం నుండి వచ్చిన చరిత్ర ఆయన కుటుంబం ది అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ.. ఆయన కుటుంబం గురించి బండి సంజయ్ మాట్లాడారని, అవగాహన ఉండి మాట్లాడారో లేకుండా మాట్లాడారో మరి అంటూ జగ్గారెడ్డి విమర్శించారు.. రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అని, వాళ్ళు హిందువులు.. అని, బ్రాహ్మణులు హిందువులు కారా..? నీకేమైనా డౌట్ ఉందా..? అని బండి సంజయ్‌ని జగ్గారెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదని, సోనియా గాంధీ ఏ మతం అని అడిగాడు సంజయ్ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను రెడ్డి… నా భార్య గౌడ్.. ఇప్పుడు మా ఆవిడని రెడ్డి అనే పిలుస్తారు కదా..? సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు.. కాబట్టి సోనియా గాంధీ బ్రాహ్మణ కుటుంబమే అవుతుందన్నారు జగ్గారెడ్డి.
Most Demanding Course : భారత్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సులు ఇవే.. లక్షల్లో ప్యాకేజీ!
సంజయ్ అవగాహన పెంచుకో అని చురకలు అంటించారు. ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ ఖానా గాండీ.. గాంధీ స్వతంత్ర ఉద్యమ కాలంలో ఆయన పేరు ఫిరోజ్ గాండీ… గాంధీగా మార్చారు ప్రజలు.. మహాత్మాగాంధీ.. రాజీవ్ గాంధీ.. సంజయ్ గాంధీ జంధ్యం వేసుకునే వాళ్ళు అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే ఆయన కూడా జంధ్యం వేసుకుంటారని, మేనకా గాంధీ సిక్కు.. సంజయ్ గాంధీని చేసుకున్నాక మేనకా గాంధీ గా మార్చుకుందన్నారు.
ఇందిరా గాంధీ భర్త.. ఫిరోజ్ స్వతంత్ర ఉద్యమ కారుడని, స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళాడన్నారు. ఫిరోజ్ హిందూ మతంలోకి మారి… ఇందిరా గాంధీని పెళ్లి చేసుకున్నారన్నారు. వాజ్ పాయి తరవాత ప్రధాని కావాల్సింది అద్వానీ అని, కానీ ఆయన్ని పక్కన పెట్టీ… మోడీ ప్రధాని అయ్యారన్నారు జగ్గారెడ్డి. ఎప్పుడైనా అద్వానీ నీ ప్రధాని చేసే ప్రయత్నం చేశారా.. అద్వానీ లేకుంటే… బీజేపీ కి దిక్కులేదు.. అద్వానీ రథయాత్ర చేయకపోతే బీజేపీ కి ఉనికి ఎక్కడిది.. మోడీ..అద్వానీ వెనకాల ఉన్నాడు.. మోడీ గుజరాత్ సీఎం అయ్యాడు అంటే…అద్వానీ వల్లనే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
Double Murder: ఆస్తి కోసం తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపిన కొడుకు..