Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రేషన్ కార్డుల విషయంలో ఎవరికీ ఆందోళన అవసరం లేదని, చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు అందజేయాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 40,000 రేషన్ […]
Davos 2025 : దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దావోస్ వెళ్లిన తెలంగాణ బృందం పది ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల్లో రూ.1,32,500 కోట్ల పెట్టుబడులు, 46,000 ఉద్యోగాలు రాబట్టింది తెలంగాణ ప్రభుత్వం. Anil Ambani: నెల్లూరులో అనిల్ అంబానీ పర్యటన.. పవర్ ప్లాంట్ భూముల పరిశీలన 1. సన్ పెట్రో కెమికల్స్: భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ప్లాంట్లు. […]
Grama Sabalu : చింతకాని మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈనెల 26 నుండి ప్రారంభం కానున్నాయి. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు పంచాయతీ కార్యదర్శి రమేష్ అధ్యక్షత వహించగా, మండల […]
Jurala Project : తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల డ్యామ్ (Jurala Project) ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ సమస్యలను ఎదుర్కొంటోంది. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదిలోని నీటిని అక్రమంగా తరలించుకుపోతుండగా, తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేయడంతో కృష్ణమ్మ దిగువకు వృధాగా పోతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్లను సక్రమంగా నిర్వహించకపోవడంతో నీరు గేట్ల నుంచి లీకవుతూ ముప్పు మరింత పెరుగుతోంది. తుప్పు పట్టిన గేట్లు, లీకైన నీరు 1995లో […]
Etela Rajender : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఉద్రిక్తత నెలకొంది. పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో జరిగింది, దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. బాధితులు, రియల్ వ్యాపారులు పేదల భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారన్న విషయాన్ని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఈటల, […]
తనదైన మార్క్ పాలనను మొదలెట్టిన ట్రంప్.. పౌరసత్వంపై కొత్త ఉత్తర్వులు! అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి పౌరసత్వం లభించే చట్టాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు. ఇప్పటివరకు ఉన్న విధానం ప్రకారం, అమెరికాలో జన్మించిన ప్రతి చిన్నారికి సహజంగా పౌరసత్వ హక్కు లభించేది. ఇది 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలులోకి వచ్చింది. కానీ, తాజాగా ట్రంప్ ఈ చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ (Executive Order) ద్వారా రద్దు చేస్తూ కీలక నిర్ణయం […]
Minister Seethakka : ములుగు జిల్లాలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్న కొండాయి గ్రామంలో, నేడు అబ్బాయిగూడెంలో మంత్రి సీతక్క ఆవిష్కరించిన శిలాఫలకాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. వరుస ఘటనలతో అధికార పార్టీ లో అయోమయం నెలకొంది. 10 నెలలు గడుస్తున్నా బ్రిడ్జి పనులు మొదలు కాలేదని, ఏటూరునాగారం మండలం దొడ్ల-మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగుపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నూతన బ్రిడ్జి కోసం […]
Weather Updates : ఒకవైపు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతున్నది. దీనికి తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు సైతం భానుడి జాడ కనిపించకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకొని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా సత్తుపల్లి,వేంసూరు,పెనుబల్లి,కల్లూరు,తల్లాడ మండలాల్లో చలి తీవ్రతతో గజగజలాడుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 8 గంటలైనా […]
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు నుండి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతుండడంతో అక్కడికి వెళ్లి అధికారుల […]
BRS : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలో నల్గొండలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయ వాతావరణంలో కలకలం రేగింది. జనవరి 21న జరగాల్సిన ఈ మహాధర్నాకు చివరి నిమిషంలో అనుమతి రద్దయింది. పోలీసుల నిర్ణయంతో బీఆర్ఎస్ నాయకత్వం హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ధర్నాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు […]