CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ
- అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు
- ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా
- ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట – అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, ఇసుక రీచ్‌ల తనిఖీలు, అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల పర్యవేక్షణ, విజిలెన్స్ దాడులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
Also Read
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
GHMC: కాంగ్రెస్ ఏడు, ఎంఐఎం ఎనిమిది నామినేషన్స్ దాఖలు
ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల సాయం అందిస్తుండగా, అదనపు ఖర్చును తగ్గించేందుకు ఇసుకను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఈ ఉచిత ఇసుక సరఫరా అమలు కోసం నలుగురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ, ఇసుక సరఫరా విధానం, లాజిస్టిక్స్, భవిష్యత్తులో తలెత్తే సమస్యలు మొదలైన వాటిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు అందించనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థానిక వాగులు, చెరువుల నుంచి ఇసుకను తీసుకోవడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అక్రమ రవాణా అడ్డుకట్ట తప్పనిసరి అని సీఎం పేర్కొన్నారు. అందుకే, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!