CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఐఏఎస్ అధికారులు ఎంతో కట్టుదిట్టంగా పని చేసేవారని, కానీ ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత అధికారి వర్గం కేవలం ఏసీ గదుల్లోనే పరిమితం అయ్యారని, ప్రజలకు అందుబాటులో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారుల అనుభవాలను నేటి ఐఏఎస్‌లు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గత ఐఏఎస్ అధికారులు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను నేరుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
గతంలో ఐఏఎస్ అధికారులు రాజకీయ నాయకులకు ప్రామాణిక సమాచారాన్ని అందించేవారని, రాజకీయ నిర్ణయాల్లో లాభనష్టాలను విశ్లేషించి వివరించేవారని, కానీ ఇప్పుడు ఆ విధానం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు. రాజకీయ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, దాని ప్రభావాన్ని ప్రభుత్వం నడిపించే అధికారులే అర్థం చేసుకోవాలని, కానీ ఇప్పుడు అలాంటి దృక్పథం తగ్గిపోయిందని అన్నారు.
Redmi Book Pro: రెడ్ మీ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్.. త్వరలో మార్కెట్‌లోకి
శంకరన్, టీఎన్ శేషన్, మన్మోహన్ సింగ్‌ల వంటి అధికారులు తమ సేవల ద్వారా దేశానికి ఎంతో కొంత న్యాయం చేశారని, ఐఏఎస్ అధికారులు వారి మార్గంలో నడవాలని సూచించారు. శంకరన్ పేదల కోసం పనిచేసిన గొప్ప అధికారి అని, శేషన్ పారదర్శక ఎన్నికల నిర్వహణకు కృషి చేసిన వ్యక్తి అని, మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను బలంగా నిలబెట్టిన నేత అని గుర్తుచేశారు.
ఒక ఐఏఎస్ అధికారి తన పని ప్రామాణికంగా నడిపించుకుంటే ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాడని అన్నారు. నిజమైన సేవగల అధికారి రాజకీయ నాయకులకంటే ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందుతాడని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న వారధిగా ఐఏఎస్ అధికారులు తమ పాత్రను సమర్థవంతంగా పోషించాలని, పాలనలో పారదర్శకత ఉండాలంటే అధికారులకు సమర్థమైన మార్గదర్శకత్వం అవసరమని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారులు ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనను మళ్లీ తీసుకురావాలని పిలుపు ఇచ్చారు. పాలనలో నిబద్ధత చూపే వారికే గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్య ధోరణిని వీడి ప్రజల అవసరాలను అర్థం చేసుకుని పనిచేయాలని సూచించారు. పేదలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని, సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు. అధికారుల ఆలోచనలో మార్పు రావాలని, వారి విధానం పూర్తిగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని సూచించారు.
Haryana Governor: దేశంలో పేదరికం పోవాలంటే విద్య ఎంతో అవసరమని గుర్తించిన వ్యక్తి జ్యోతిరావు పూలే..