అన్నం పెట్టే బ్యాంకుకే కన్నం పెట్టాడు. రోజుకింత బంగారం తీసుకెళ్లాడు. ఒక్కటి రెండు కాదు బ్యాంక్లో తాకట్టు పెట్టిన 402 ఖాతాలకు చెందిన 20 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు తీసుకెళ్లి వేరే బ్యాంకుల్లో తాకట్టుపెట్టి డబ్బులు దారి మల్లించాడు.
రాంగ్ కాల్లో పరిచయం.... ఆపై ప్రేమ ....పెళ్లి ... పిల్లలు ...ఇలా సంతోషంగా సాగుతున్న జీవితంలో భార్య తప్పటడుగులు.... భర్త పెంచుకున్న అనుమానంతో , ప్రేమించి పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త.
కట్నం ఎంత ఇచ్చినా.. కొంత మంది కిరాతక భర్తలు సంతృప్తి పడడం లేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని అని.. భార్యలను వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. అంతే కాదు అడిగినంత అదనపు కట్నం తీసుకు రాకుంటే అంతే సంగతులు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లోని ఓటర్ అధికార యాత్రకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి కూడా బీహార్లో చేరారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులు మరొకసారి ఒక ప్రత్యేక శిక్షణానుభవానికి సాక్ష్యమయ్యారు. సైన్స్ ఉపాధ్యాయుడు భీంపుత్ర శ్రీనివాస్ కాస్త భిన్నంగా తయరయ్యారు.
కర్ణాటకలోని మైసూరు జిల్లా హునసూరు తాలూకాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గెరసనహళ్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి రక్షితను ఆమె ప్రియుడు అమానుషంగా హతమార్చాడు. పోలీసుల సమాచారం ప్రకారం, రక్షితకు కేరళకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తండ్రీకూతుళ్ల ప్రాణాలను బలి తీసుకుంది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా లారీ వారిని ఢీకొట్టి ఈ దుర్ఘటన జరిగింది.
యూరియా సరఫరాపై తుమ్మల ఓపెన్ లెటర్.. కేంద్రం వైఫల్యంతో రైతులు ఇబ్బందులు తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించేందుకు ఎంతవరకైనా పోరాడుతామని హామీ ఇచ్చారు. లేఖలో ప్రభుత్వం ఇప్పటి వరకు పాత […]