Etela Rajender : మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉప్పల్ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆత్మగౌరవం, దేశభక్తి విలువలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ ఆత్మగౌరవం కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలా వదిలివేశామని ఈటల రాజేందర్ అన్నారు. ఆత్మగౌరవం కోల్పోయి వచ్చే ఏ పదవి అయినా విలువలేనిదని ఆయన స్పష్టం చేశారు. స్వయంపాలన కోసమే తాము 20 ఏళ్లలో ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచామని గుర్తు చేసుకున్నారు.
పిల్లలకు వారసత్వంగా ఆస్తులు కాకుండా విలువలు, సంప్రదాయాలు, దేశభక్తిని నేర్పించాలని ఈటల సూచించారు. కన్నవారిని, కన్నపిల్లలను, జీవిత భాగస్వామిని చంపుకుంటున్న ఘటనలు కలచివేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన విలువలే మనల్ని ఇలాంటి దురాగతాల నుంచి కాపాడతాయని హెచ్చరించారు. ఈ ఘటనలు ఎక్కడో జరుగుతున్నాయని అనుకోవద్దని, అవి మన ఇంటి గడపను కూడా తట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.
Wolf Attacks: యూపీలో మళ్లీ మొదలైన తోడేళ్ల దాడి.. ఇద్దరు మృతి, 9 మందికి గాయాలు…
మహనీయుల విగ్రహాలను స్థాపించడం, జయంతులు, వర్ధంతులు చేసుకోవడం కేవలం దండ వేయడానికి మాత్రమే కాదని, వారి చరిత్రను భావితరాలకు అందించడం కోసమని ఈటల అన్నారు. తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తుచేస్తూ, భారత స్వాతంత్ర్యం కోసం లక్షల మంది చేసిన పోరాటాలను, త్యాగాలను ఆయన కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుతూ, ఆయన గొప్ప మేధావి అని, తన ప్రాణం భారత జాతి విముక్తి కోసమేనని పోరాడారని ప్రశంసించారు. భారతదేశంలో సాధ్యం కాకపోవడంతో వేరే దేశానికి వెళ్లి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ స్థాపించి దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. నేటి తరానికి స్వాతంత్ర్య వేడుకల ప్రాముఖ్యత తెలియడం లేదని, వారు పుస్తకాలు చదవక, చరిత్రను తెలుసుకోలేకపోతున్నారని ఈటల రాజేందర్ విచారం వ్యక్తం చేశారు.
AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ కస్టడీకి మిథున్‌రెడ్డి