HYD Rains : గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. సాయంత్రం వేళల్లో మొదలవుతున్న ఈ భారీ వర్షాలు నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. నిన్న కురిసిన కుండపోత వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈరోజు కూడా అదే విధంగా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నగరంలో ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. రాబోయే రెండు గంటల పాటు నగరవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ప్రొఫిషనల్ కెమెరాలు అవసరం లేదేమో.. డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న Honor Magic V8 series?
ప్రస్తుతం పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడికాపూల్, నాంపల్లి, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో, బషీర్బాగ్, అబిడ్స్, కోఠి, హిమాయత్ నగర్ వంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్ వంటి శివారు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కొనసాగుతోంది. ఈ అకాల వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంది. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Rahul Gandhi : ఓట్లు తొలగింపు వివరాలు ఇవ్వాలని కర్ణాటక సీఐడీ కోరినా.. ఈసీ స్పందించడంలేదు