Shocking : దురదృష్టవశాత్తు గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏ వయసు వారికైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏకలవ్య (30) అనే యువకుడు ఇబ్రహీంపట్నంలో తన స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాడు. బుధవారం రాత్రి అతను జ్యూస్ తాగడానికి ఒక జ్యూస్ సెంటర్ దగ్గరికి వచ్చాడు.
BJP: రాహుల్ గాంధీ సొంత దేశంపైనే అణుబాంబు, హైడ్రోజన్ బాంబు వేస్తున్నాడు.
జ్యూస్ తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన స్థానికులు అతడికి సీపీఆర్ (CPR) చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు తమ వాహనంలోనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఏకలవ్య మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డయింది. 30 ఏళ్ల యువకుడు గుండెపోటుతో చనిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు.
AP Assembly : ఏపీ అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బొండా ఉమ ఆగ్రహం!