Air India: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు చాకచక్యంగా దాన్ని వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. మధ్యాహ్నం 2:20 గంటలకు విశాఖ నుంచి హైదరాబాద్‌కు 103 మంది ప్రయాణికులతో ఈ విమానం బయలుదేరింది. గాల్లోకి లేచిన కొద్దిసేపటికే విమానం రెక్కల్లో ఒక పక్షి ఇరుక్కుంది. దీని కారణంగా విమానం ఇంజిన్ ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి.
ఈ సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చి విమానాన్ని వెనక్కి తిప్పారు. సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత విమానంలోని ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ఎయిర్ లైన్స్ సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఘటనపై విమానయాన సంస్థ విచారణ చేపట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Ilaiyaraaja : చుక్కలు చూపిస్తున్న ఇళయరాజా.. మరీ ఇంత అవసరమా..?