Team India History: టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్రాత్మక రికార్డు!
- టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు
- నమీబియాపై భారత్ అతిపెద్ద విజయం
- కేవలం గెలవడం కాదు ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India T20 World Cup History: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లలో భారత్ ఎన్నో ఘన విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా పరుగుల తేడాతో సాధించిన భారీ విజయాలు టీమ్ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ప్రత్యర్థులను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టుతూ భారత్ సాధించిన ఈ విజయాలు టోర్నమెంట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ సాధించిన అతిపెద్ద విజయం నమీబియాపై నమోదు చేసింది. 2026లో ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌కే కాకుండా మొత్తం టోర్నమెంట్ చరిత్రలోనే అద్భుత ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
2012లో ఇంగ్లాండ్‌పై 90 పరుగుల తేడాతో సాధించిన విజయం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఆ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగింది. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ మంచి ప్రదర్శనతో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేసింది. మూడో స్థానంలో 2014లో ఆస్ట్రేలియాపై 73 పరుగుల భారీ గెలుపు ఉంది. ఈ మ్యాచ్ మిర్పూర్‌లో జరిగింది. 2022లో మెల్బోర్న్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 71 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 2024 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 68 పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. నాకౌట్ మ్యాచ్‌లో ఇలాంటి భారీ విజయం సాధించడం భారత్ స్థిరత్వాన్ని, పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
Also Read: Team India History: చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో టాప్ టీమ్!
మొత్తం చూస్తే.. ఈ రికార్డులు భారత్ టీ20 ఫార్మాట్‌లో ఎంత బలమైన జట్టో చూపిస్తున్నాయి. భారీ మార్జిన్ విజయాలు సాధించడం అంటే కేవలం గెలవడం కాదు, ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించడం. భారత్ ఆ విషయంలో ప్రపంచ క్రికెట్‌కు మళ్లీ మళ్లీ తన సత్తా నిరూపిస్తోంది. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ 2026 జరుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. అమెరికా, నమీబియాపై భారత్ గెలిచింది. ఇక ఫ్రిబ్రవరి 15న దాయాది పాకిస్థాన్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!