అక్కడ అంతా మేడమ్ ఇష్టమేనా? నేను మోనార్క్‌ని.... గిల్లితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చించుకోవాలని అంటున్నారా? పార్టీ నిర్ణయాలతో పని లేకుండా... తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా? మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా... నేను చెప్పిన వాళ్ళే కార్పొరేటర్స్ అవుతారని అంటున్న ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరు?
ఖేలో ఇండియా, కామన్ వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపర్చడం, కోచ్‌లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటుకు బోర్డు తీర్మానాలు చేసింది.
తెలంగాణలో కమలం కట్టు తప్పుతోందా? క్రమ శిక్షణకు కేరాఫ్ అని చెప్పుకునే పార్టీలో ఇక అది భూతద్దం పెట్టి వెదికినా కనిపించే అవకాశాలు ఉండవా? పార్టీ పెద్దలే అందుకు ఊతం ఇస్తున్నారా? దారిన పెట్టాల్సి వాళ్ళే గాడి తప్పుతున్నారా? రాష్ట్ర పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో అంతర్గత రచ్చ... అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జగిత్యాల జిల్లా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లి గ్రామాలపై విరుచుకుపడుతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. రహదారులు దెబ్బతినగా, చిన్న చిన్న కాలువలు కూడా నదుల్లా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది […]
నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది.
సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతూనే ఉంది. అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నర్మాల గ్రామస్తుల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను ప్రజలు ఎంతగానో కొనియాడుతున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నర్మాల గ్రామంలో చిక్కుకుపోయిన ఐదుగురు గ్రామస్తులను సురక్షితంగా కాపాడటంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.