Value Zone: హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని వాల్యూ జోన్ హైపర్‌మార్ట్ షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని విస్తృత ఆఫర్లు, ప్రత్యేక రాయితీలు సిద్ధం చేశారు. వాల్యూ జోన్‌లో 75,000కి పైగా ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు లభ్యమవుతుండగా, 2,500కు పైగా ప్రముఖ బ్రాండ్ల నుంచి అపారెల్స్, ఫుట్‌వేర్, కిడ్స్ వేర్, హోమ్ నీడ్స్ వంటి విభాగాల్లో విస్తృత కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 6,500కి పైగా గృహోపకరణాలు, కిచెన్ అప్లయెన్సెస్, బ్యూటీ & హెల్త్ ఉత్పత్తులు ప్రత్యేక రాయితీలతో లభిస్తున్నాయి. పిల్లల కోసం 2,000కి పైగా బై 1 – గెట్ 1 ఫ్రీ ఆఫర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
Turkey: ఎర్డోగాన్‌కు ఇండియా దెబ్బ.. టర్కీ శత్రువుతో భారత్ రక్షణ ఒప్పందం..

ప్రతి వర్గానికి అందుబాటు ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని వాల్యూ జోన్ ప్రతినిధులు తెలిపారు. కస్టమర్లకు విశాలమైన పార్కింగ్, సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం కల్పించబడిందని పేర్కొన్నారు. స్థానిక ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకుని విభిన్న ఉత్పత్తులను అందిస్తున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ పండుగ సీజన్‌లో షాపింగ్‌ను పండుగలా మార్చే అమీర్‌పేట్ వాల్యూ జోన్ ఆఫర్లు వినియోగదారులకు నిజమైన సంతోషాన్ని అందిస్తాయని నిర్వాహకులు నమ్ముతున్నారు.
