Today Business Headlines 08-04-23: షాపులు 24 గంటలు ఓపెన్: బిజినెస్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. షాపులను, సంస్థలను 24 గంటలు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఈ మేరకు ఏడాదికి 10 వేల రూపాయలు ఫీజు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతోపాటు కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. షాపుల్లో పనిచేసే ఉద్యోగులు మరియు సిబ్బందికి సంబంధించి రికార్డులను మెయిన్‌టెయిన్ చేయాలని.. ఐడీ కార్డులు ఇవ్వటంతోపాటు వాటిపై షిఫ్ట్ టైమింగ్స్ ప్రింట్ చేయాలని సూచించింది.
Today Business Headlines 07-04-23: ‘సచిన్’కి తనిష్క్ కానుక: ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ పేరుతో వజ్రాభరణాలు అందుబాటులోకి వచ్చాయి. టాటా గ్రూపునకు చెందిన తనిష్క్ జ్యూలరీ కంపెనీ.. ఈ ఉత్పత్తులను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నెల 24వ తేదీన సచిన్ 50వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో వీటిని తయారుచేయించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ 100 సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే.
Be careful of ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీ.. అద్భుతాలు చేస్తోందంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సరికొత్త సాంకేతికతలో కూడా కొన్ని లోటుపాట్లు బయటపడుతున్నాయి. అడిగిన సమాచారాన్ని లోపాలు లేకుండా ఇవ్వటంలో ఈ చాట్‌బాట్ తడబడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇదొక లోపం కాగా.. ఈ కృత్రిమ మేధతో షేర్ చేసుకునే మన పర్సనల్ డేటాకు ప్రైవసీ లేకపోవటం మరో లోపం.
Today Stock Market Roundup 06-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ గురువారం ఓ మోస్తరు లాభాలతో ముగిసింది. ఎర్లీ ట్రేడింగులో ఊగిసలాట ధోరణిలో జరిగిన ట్రేడింగ్ కారణంగా వచ్చిన నష్టాలను ఇంట్రాడేలో పూడ్చుకోగలిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను పెంచకపోవటం కలిసొచ్చింది. జీడీపీ గ్రోత్ మరియు ద్రవ్యోల్బణానికి సంబంధించి ఆర్బీఐ వెల్లడించిన గణాంకాలు ఈక్విటీ మార్కెట్ పెట్టుబడిదారుల సెంటిమెంటును బలపరిచాయి.
Royal Enfield New Record: రాయల్ ఎన్ఫీల్డ్ టూ-వీలర్ రికార్డ్ నెలకొల్పింది. ఆ వెహికిల్ చరిత్రలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్నడూ లేనన్ని యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్.. 650 సీసీ మోటార్ సైకిల్స్ రేంజ్‌ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా స్క్రామ్ 650 సీసీ, క్లాసిక్ 650 మరియు హిమాలయన్ 650 మోడళ్లను ఈ ఏడాది మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ఆశిస్తోంది.
Today Business Headlines 06-04-23: ఆర్బీఐ అనూహ్య నిర్ణయం: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్బీఐ నిర్ణయాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు మరోసారి పెంచకుండా పాత వాటినే కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇవాళ వెల్లడించారు. రెపో రేటును మార్చకుండా ఆరున్నర శాతంగానే అమలుచేస్తామని తెలిపారు.
Crude Oil Conspiracy: చమురు ధరలు మళ్లీ మండిపోనున్నాయి. ప్రస్తుతం 85 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ఆయిల్ రేటు త్వరలోనే వంద డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు వారీ చమురు ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ అరేబియాతోపాటు ఒపెక్ ప్లస్ దేశాలు ప్రకటించటమే దీనికి కారణం. ఈ ప్రకటన కారణంగా ఒక్క రోజులోనే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర 8 శాతం పెరిగింది.
Today Stock Market Roundup 05-04-23: దేశీయ ఈక్విటీ మార్కెట్ ఇవాళ బుధవారం లాభాలతో ప్రారంభమై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుతున్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ స్టాక్ మార్కెట్‌పై కనిపించకపోవటం గమనించాల్సిన అంశం. దీంతో.. ఇంట్రాడేలో కూడా లాభాలు కొనసాగాయి. గత ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో వ్యాపార రంగం ఆరోగ్యవంతమైన ఫలితాలను కనబరచటం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను పెంచింది.
Alibaba Group Splitting: చైనాలోని ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా గ్రూప్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాల్పడుతున్న సాధింపు చర్యలకు విరుగుడుగా సరికొత్త వ్యూహాన్ని అమలుచేసింది. బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని అర డజను ముక్కలుగా విభజించాలని నిర్ణయించింది. ఒక కంపెనీని ఆరు ఎంటిటీలుగా మార్చటం ద్వారా విలువ పెంచాలని భావిస్తోంది. అలీబాబా గ్రూప్ ప్రకటించిన ఈ ప్రణాళిక.. మార్కెట్లను అమితాశ్చర్యానికి గురిచేసింది.
Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే..: క్రీడా రంగంలో.. ముఖ్యంగా క్రికెట్లో.. కోహ్లి, ధోని, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ వాణిజ్య ప్రకటనలతో దూసుకెళుతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 505 సంస్థలు సెలెబ్రిటీలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోగా.. అందులో ఏకంగా 381 ఒప్పందాలను క్రికెటర్లతోనే కుదుర్చుకోవటం విశేషం. మొత్తం డీల్స్ వ్యాల్యూ 749 కోట్ల రూపాయలు.