Today Business Headlines 30-03-23: అసోచామ్ అధ్యక్షుడిగా: ఇండియాలోని ఇండస్ట్రియల్ అసోసియేషన్లలో ఒకటైన అసోచామ్కి ప్రెసిడెంట్‌గా అజయ్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రస్తుతం స్పైస్‌జెట్ సంస్థకు సీఎండీగా వ్యవహరిస్తున్నారు. అసోచామ్.. అంటే.. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అని అర్థం. ఈ సంఘం వందేళ్లకు పైగా సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థకు అధ్యక్షుడిగా సర్వీస్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు అజయ్ సింగ్ తెలిపారు.
Today Stock Market Roundup 29-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం పర్వాలేదనిపించింది. రెండు కీలక సూచీలు కూడా చెప్పుకోదగ్గ పనితీరు కనబరిచాయి. అన్ని రంగాల కంపెనీల షేర్లు లాభాల బాట పట్టాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. సాయంత్రం కూడా లాభాలతోనే ముగిశాయి. సెన్సెక్స్.. 346 పాయింట్లు పెరిగి 57 వేల 960 పాయింట్ల వద్ద ఎండ్ అయింది.
AI Software New Version: కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల రిలీజ్ చేసింది. జీపీటీ-4గా పేర్కొనే ఈ ప్రొడక్ట్.. క్లిష్టమైన సమస్యలను కూడా.. గతంలో కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పరిష్కరించగలదని పేర్కొంది. సమస్యల పరిష్కార సామర్థ్యాలు మరియు జనరల్ నాలెడ్జ్ దీనికి విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఓపెన్ ఏఐ సంస్థ ఈ మేరకు ఒక వీడియోని షేర్ చేసింది.
Today Business Headlines 29-03-23: కొత్త యాక్టివా లాంఛ్: యాక్టివాలో కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేట్ చేసిన ఇంజన్‌తో దీన్ని రూపొందించినట్లు హోండా మోటర్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తెలిపింది. ఏప్రిల్ నుంచి కఠినమైన ఉద్గార ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. దీంతో.. వాటికి అనుగుణంగా నయా యాక్టివాను తయారుచేశామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించామని వెల్లడించింది.
Today Stock Market Roundup 28-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందటంతో ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. కానీ.. ఇంట్రాడేలో లాభనష్టాల నడుమ ఊగిసలాడాయి. సాయంత్రం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ 57 వేల 550 లెవల్ వద్ద 100 పాయింట్లు కోల్పోయింది.
Indo-Russian mega meet: ఇండియా, రష్యా దేశాల మెగా బిజినెస్ మీటింగ్ ఈ నెల 29, 30 తేదీల్లో జరగనుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్వహించే ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. "అభివృద్ధి మరియు పెరుగుదల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం" అనే కాన్సెప్ట్‌తో ఈ భేటీ జరగబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఈ సంవత్సరం 50 బిలియన్ డాలర్లకు చేర్చటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Today Business Headlines 28-03-23: 4 ఏళ్లలో 2134 కోట్లు: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్ఆర్.. కింద 2 వేల 134 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ నిధులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 2016-17వ సంవత్సరం నుంచి 2020-21వ సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం లోక్‌సభలో వెల్లడించింది.
Today Stock Market Roundup 27-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్ ఈ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించింది. ఇవాళ సోమవారం ఉదయం ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో సూచీలు ఊగిసలాడాయి. తర్వాత లాభాల బాట పట్టాయి. కానీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రెపో రేటును పావు శాతం పెంచే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపలేదు.
Royal Enfield Powerful Bike: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ని 2025 నాటికి లాంఛ్ చేయాలని భావిస్తోంది. విద్యుత్ వాహనాల తయారీలో ఇప్పటికే ఎంతో ప్రోగ్రెస్ సాధించామని తెలిపింది. మోటర్ సైకిల్ మార్కెట్లోని మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో 93 శాతానికి పైగా వాటా కలిగిన ఈ సంస్థ.. ఈవీ విభాగంలోనూ సత్తా చాటాలని చూస్తోంది. తొలి విడతలో 5 వేల బైక్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక టీమ్‌ని ఏర్పాటుచేసింది.
Today Business Headlines 27-03-23: టీసీఎస్ రాజన్నకు అవార్డు: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ రీజనల్ హెడ్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజన్నకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఈ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. రాజన్నకు సాఫ్ట్వేర్ సెక్టార్లో 30 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది. ఆ సుదీర్ఘ అనుభవం తెలంగాణ ఐటీ రంగం అభివృద్ధికి మరియు రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుందని అసోసియేషన్ పేర్కొంది.