Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాకిస్తాన్ భారత్‌ను ఎదుర్కొనే పనిలో పడింది. పహల్గామ్ దాడి తర్వాత, భారత్ జరిపిన ప్రతీకార చర్యలో పాకిస్తాన్ దారుణంగా భంగపడింది. 11 ఎయిర్ బేసులపై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇదే కాకుండా పీఓకే, పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్న లష్కరేతోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ దాడుల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం ‘‘రాకెట్ ఫోర్స్ కమాండ్’’ ఏర్పాటు…
Operation Sindoor: భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి దిగితే, సమాధానం చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు వెంబడి 8 ఉగ్రవాద శిబిరాలు చురుకుగా ఉన్నాయని, వీటిలో 6 నియంత్ర రేఖ వెంబడి, మరో రెండు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో ద్వివేదీ ఈ వ్యాఖ్యలు చేశారు. Read…
Masood Azhar: పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) అధిపతి మసూద్ అజార్‌కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను వణికించే ప్రకటన చేశాడు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
S Jaishankar: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌ను ‘‘చెడు పొరుగుదేశం’’గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్‌కు ఉందని చెప్పారు. పరోక్షంగా ఉగ్రవాదానికి పాల్పడితే దాడులు చేస్తామని హెచ్చరించారు. మద్రాస్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడుతూ, "మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఎవరూ చెప్పలేరు" అని మంత్రి ఆపరేషన్ సిందూర్‌ను ఉద్దేశించి అన్నారు.
Balochistan: భారతదేశానికి పాకిస్తాన్ గడ్డ నుంచి తిరుగులేని మద్దతు వచ్చింది. ప్రముఖ బలూచ్ నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలూచ్ పాక్-చైనా సంబంధాలు తీవ్రం కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కొన్ని నెలల్లో చైనా తన సైన్యాన్ని బెలూచిస్తాన్‌లో మోహరించవచ్చని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖలో, బెలూచిస్తాన్ దశాబ్దాలుగా పాకిస్తాన్ నియంత్రణలో అణచివేతను ఎదుర్కొంటోందని, అందులో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Pakistan: పాకిస్తాన్‌కు యుద్ధం చేతకాదు, భారత్‌తో ప్రతీసారి ఓడిపోతున్నప్పటికీ తన ప్రజల్ని బకరాలను చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తోంది. పాక్ ప్రజలే కాదు, భారత్‌లోని కొందరు వ్యక్తులు కూడా పాక్ అబద్ధాలకు వంతపాడుతున్నారు. మరోసారి, పాకిస్తాన్ తన బుద్ధిని బయటపెట్టింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ దాడుల్లో పాక్‌లోని 11 ఎయిర్‌బేసులు దారుణంగా ధ్వంసమయ్యాయి.
LeT leader: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు, పాక్ సైన్యంపై విరుచుకుపడింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఇతర భాగాల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి ప్రధాన కార్యాలయాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, భారత్ తమ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని లష్కరేతోయిబా(ఎల్ఇటి) అగ్ర నాయకుడు అంగీకరించాడు. అయినప్పటికీ, భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.…
తాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.