Writeoff Loans: లోన్లు తీసుకున్నవాళ్లలో ప్రతిఒక్కరూ వాటిని పూర్తిగా తిరిగి చెల్లిస్తారనే గ్యారంటీ లేదు. దీంతో.. వివిధ కారణాల వల్ల కొన్ని రుణాలు మొండి బకాయిలుగా మారుతుంటాయి. నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని సాంకేతికంగా రద్దు చేస్తుంటారు. అంటే.. టెక్నికల్‌గా.. రైటాఫ్ చేస్తారు. ఫలితంగా.. కొందరు.. ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదేమో అనుకుంటారు.
Today Business Headlines 04-04-23: ఈ 35 వేల కోట్లు ఎవరివో?: ఆ డబ్బులు మావి.. అంటూ.. ఎవరూ క్లెయిమ్ చేయని డిపాజిట్లు 35 వేల 12 కోట్ల రూపాయలకు చేరాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తమ వద్ద మూలుగుతున్న ఆ సొమ్మును ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బదిలీ చేశాయి. ఫిబ్రవరి నెల వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ లోక్‌సభకు వెల్లడించారు.
Today Stock Market Roundup 03-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారం ట్రేడింగ్‌ని లాభాలతో ప్రారంభించి లాభాలతోనే ముగించింది. ఇవాళ సోమవారం ఉదయం రెండు కీలక సూచీలు లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల వార్తల ప్రభావంతో కొద్దిసేపటికే నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో తిరిగి పుంజుకున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలతోపాటు కొన్ని ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ కొనుగోళ్లు ఊపందుకోవటం కలిసొచ్చింది.
Sleeping in Office: ఆఫీసులో పనిచేయకుండా నిద్రపోతే ఉద్యోగం ఊడటం ఖాయం. కంపెనీ ఏదైనా అది ఫాలో అయ్యే పాలసీ మాత్రం ఇదే. కానీ.. బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సంస్థ అందరి కన్నా భిన్నంగా ఆలోచించింది. నిద్రపోయేందుకు ప్రత్యేకంగా ఒక అర్ధ గంట సమయాన్ని కేటాయించింది. పని వేళల్లో అలసటగా అనిపించినప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకునేందుకు అనుమతిస్తోంది. ఈ మేరకు ‘రైట్ టు న్యాప్’ అనే పాలసీని తెర మీదికి తీసుకొచ్చింది.
IMF bailout for Sri Lanka: చుట్టూ ఉండే సముద్రపు నీటి మాదిరిగా.. చుట్టుముట్టిన ఆర్థిక సమస్యలతో.. సంక్షోభ సంద్రంలో చిక్కుకున్న శ్రీలంకకు.. IMF రూపంలో శ్రీరామరక్ష లభించింది. ఆ.. ద్వీప దేశానికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగేళ్లపాటు అమలుచేయనున్న ఈ బెయిలౌట్ ప్రోగ్రామ్‌లో భాగంగా తక్షణం 333 మిలియన్ డాలర్లు విడుదల చేయనుంది.
Today Business Headlines 03-04-23: కేంద్ర ప్రభుత్వ రుణాలివీ..: కేంద్ర ప్రభుత్వ అప్పులు దాదాపు 151 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన ఈ వివరాలను ఆర్థిక శాఖ లేటెస్ట్గా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ క్వార్టర్‌తో పోల్చితే ఈ రుణాలు 2 పాయింట్ 6 శాతం పెరిగాయి. మొత్తం అప్పుల్లో 28 పాయింట్ రెండు తొమ్మిది శాతం రుణాలను ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంది.
Today Stock Market Roundup 31-03-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతాన్ని మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ట్రేడింగ్ రోజుని శుభారంభం చేయటమే కాకుండా ఇన్వెస్టర్లలో మస్త్ జోష్ నింపింది. నిన్న గురువారం సెలవు అనంతరం ఇవాళ శుక్రవారం తిరిగి ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్.. పెట్టుబడిదారుల సంపదను 3 పాయింట్ 7 లక్షల కోట్లు పెంచటం విశేషం. దీంతో.. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎం-క్యాప్ మొత్తం విలువ 258 పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరింది.
6G Technology: ప్రపంచంలో అంతం అంటూ లేనివాటిలో టెక్నాలజీ కూడా ఒకటి. అందుకే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాంకేతికతలు తెర మీదికొస్తున్నాయి. తద్వారా.. మన జీవితాలను మరింత సౌకర్యవంతంగా, సులభంగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాలోకి 5జీ టెక్నాలజీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సాంకేతికత.. భారతదేశంలో శరవేగంగా దూసుకుపోతోంది. ప్రభుత్వ అంచనాలను మించిపోయింది.
Today Business Headlines 31-03-23: వెయ్యి మందికి జాబ్స్: హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ సర్వీసుల సంస్థ ప్లూరల్ టెక్నాలజీస్.. వచ్చే మూడు సంవత్సరాల్లో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వాళ్లను టెక్నాలజీ కన్సల్టెంట్లుగా నియమించుకొని.. అందులో సగం మందికి జపనీస్ భాషలో ట్రైనింగ్ ఇవ్వనుంది. జపాన్ పార్ట్నర్ కంపెనీ సీసమ్ టెక్నాలజీస్‌తో కలిసి 2025 చివరి నాటికి ఎంటర్ప్రైజెస్ టెక్నాలజీ సర్వీసెస్‌లో 10 కోట్ల డాలర్ల బిజినెస్ చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Marry Now Pay Later: పెళ్లి చేయాలంటే బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి. ఎందుకంటే.. మన దేశంలో చాలా మంది.. మ్యారేజ్‌ని ప్రెస్టేజ్‌గా భావిస్తారు. అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశిస్తారు. అందుకే.. అప్పు చేసి మరీ పప్పన్నం పెట్టేందుకు వెనకాడరు. దీనికోసం కొందరు.. తెలిసినవారి దగ్గర డబ్బు తీసుకుంటారు. మరికొందరు.. బ్యాంకుల నుంచి లోన్లు పొందుతారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని నవతరం ఫిన్‌టెక్ కంపెనీలు.. బై నౌ పే లేటర్.. మాదిరిగా.. మ్యారీ నౌ పే లేటర్.. అంటున్నాయి.