Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీన్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Uppu Kappurambu : 28 రోజుల్లోనే షూట్ కంప్లీట్.. కీర్తి సురేష్, సుహాస్ కామెంట్స్
ఇందులో రామ్ డై హార్డ్ ఫ్యాన్ పాత్రను చేస్తున్నాడు. ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన టైటిల్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. టాప్ టెక్నిషియన్స్ తో ఈ ప్రాజెక్ట్ అత్యున్నత స్థాయి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోందని మూవీ టీమ్ చెబుతోంది. ఈ సినిమా కోసం రామ్ తన లుక్ ను మార్చేసుకున్నాడు. షేవ్ చేసుకుని స్లిమ్ గా కనిపిస్తున్నాడు. ఇందులో లవ్ స్టోరీకి మంచి బేస్ ఉంటుందని తెలుస్తోంది. రామ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.
Read Also : Manchu Vishnu : విష్ణు సొంత బ్యానర్ లో మూవీలు ఆపేస్తాడా..?