అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. పైలట్ ఆత్మహత్య కారణంగానే ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తుది నివేదిక రాలేదు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు సంస్థలు ఇంకా బయటపెట్టలేదు. ఏఏఐబీ మాత్రం 15 పేజీల ప్రాథమిక రిపోర్టును బయటపెట్టింది.
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి మూడు నెలలు గడిచింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా వెలువడలేదు. ఆ మధ్య కాలంలో 15 పేజీల ప్రాథమిక నివేదిక విడుదలైంది. అయితే ఈ నివేదిక తీవ్ర దుమారం రేపింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలన్నీ తప్పుడు కథనాలని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు కొట్టిపారేశారు. అంతర్జాతీయ మీడియా సొంత కథనాన్ని ప్రసారం చేస్తున్నాయని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్‌నే కారణమంటూ అంతర్జాతీయ మీడియా ఊదరగొట్టింది. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఎయిరిండియా బోయింగ్ విమానం కూలిపోయిందంటూ వార్తలు వండి వార్చాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఇటీవల జాతీయ, అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన కథనాలు హల్‌చల్ చేశాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా కథనాలు వండి వార్చాయి. ఇటీవల విడుదలైన ప్రాథమిక రిపోర్టు ఆధారంగా ఈ ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్‌టీఎస్‌బీ) చైర్‌పర్సన్ జెన్నిఫర్ హోమెంట్ తోసిపుచ్చారు. అవన్నీ ఊహాజనిత కథనాలేనని స్పష్టం చేశారు. ఇక మీడియా కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా…
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక రిపోర్ట్ వచ్చాక.. వేళ్లులన్నీ పైలట్ వైపే చూపిస్తున్నాయి. కాక్‌పిట్‌లో రికార్డైన వాయిస్ ప్రకారం.. ఫ్యూయల్ స్విచ్‌లు ఎందుకు ఆపావంటూ అడగడం.. లేదంటూ ఇంకొకరు సమాధానం చెప్పడం.. ఇలా ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణ క్లియర్‌గా రికార్డైంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక వచ్చాక లేనిపోని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అటు బాధిత కుటుంబాల్లో తీవ్ర ఆవేదన.. ఇటు ప్రయాణికుల్లోనూ సరికొత్త భయాందోళనలు నెలకొన్నాయి. పైలట్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానంలోని ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లాకింగ్ మెకానిజం తనిఖీని పూర్తి చేసిందని, ఎటువంటి లోపం లేదని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్…
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరిగాక నివేదిక వస్తుందని అందరూ ఆశించారు. అందులోనే ప్రమాదానికి కారణమేంటో కూడా తేలిపోతుందని భావించారు. కానీ విచారణ నివేదికలో కొన్ని అంశాలు ముందే లీకయ్యాయి. ఈ అంశం మరిన్ని చిక్కుముడులకు తావిచ్చింది. ఎక్కడైనా విమాన ప్రమాదం జరిగాక.. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుంది. తుది నివేదిక బయటపడేదాకా.. విచారణ జరుగుతున్న తీరును అతి రహస్యంగా ఉంచుతారు. ఎక్కడా విచారణాంశాలు లీకవ్వకుండా జాగ్రత్తపడతారు. మానవ తప్పిదాలు, సాంకేతిక కారణాలు, అనుకోని ఘటనలు..…